మరికొన్ని దారి మళ్లింపు
పలు రైళ్ల రద్దు..
ఖమ్మంరాపర్తినగర్: మోంథా తుపాన్ ప్రభావంతో ఖమ్మం మీదుగా నడిచే పలు రైళ్లను రద్దు చేశారు. ఇంకొన్నింటిని ఇతర మార్గాల్లో మళ్లించారు. విజయవాడ – డోర్నకల్(67768), డోర్నకల్ – కాజీ పేట (67766), వికారాబాద్ – గుంటూరు (12748), చర్లపల్లి – తిరుపతి (07001, తిరుపతి – చర్లపల్లి (070002), చర్లపల్లి – త్రిచూర్ (07251), త్రిచూర్ – చర్లపల్లి (07252), విజయవాడ – భద్రాచలంరోడ్ (67215) భద్రాచలంరోడ్ –విజయవాడ (67216), గుంటూరు – సికింద్రాబాద్ (12705) రైళ్లను రద్దు చేశారు. అలాగే, సికింద్రాబాద్ – గుంటూరు (12706), సికింద్రాబాద్ – విజయవాడ(12714) తదితర రైళ్లు స్టేషన్లలో వరద కారణంగా ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. అలాగే, విశాఖపట్నం– సికింద్రాబాద్(20833)రైలును విజ యవాడ, గుంటూరు, పగడిపల్లి మీదుగా సికింద్రాబాద్‌కు నడిపించారు. అంతేకాక నర్సాపూర్ – నాగర్‌సోల్(12787), షిర్డీసాయినగర్ – కాకినాడపోర్ట్(12705),సికింద్రాబాద్ – గుంటూరు (12702), తిరుపతి – ఆదిలాబాద్(17405), బరౌ ని– ఎర్నాకులం(12521), హజ్రత్‌నిజాముద్దీన్ – చైన్నె సెంట్రల్ వెళ్లే ఎక్స్‌ప్రెస్, తిరువనంతపు రం – న్యూఢిల్లీ (12625) రైలు, తిరువనంతపురం – నిజాముద్దీన్(12643) ఎక్స్‌ప్రెస్‌నుదారి మళ్లించారు.
అత్యవసమైతేనే ప్రయాణించండి
ఖమ్మం నుంచి విజయవాడ, వరంగల్ మార్గంలో అత్యవసరమైతేనే రైలు ప్రయాణం ఎంచుకోవాలని ఖమ్మం చీఫ్ కమిర్షియల్ అధికారి రాజ్‌గోపాల్ కోరారు. తుపాన్ కారణంగా కొన్ని రైళ్లను రద్దు చేయగా, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు తెలిపారు. ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్ మార్గంలో బ్రిడ్జిల పైనుంచి నీరు ప్రవహిస్తున్నందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు. అత్యవసర సమాచారం కోసం హెల్ప్‌లైన్ నంబర్ 90633 25169లో సంప్రదించాలని సూచించారు.
మధిరలో నిలిచిన షిర్డీ ఎక్స్‌ప్రెస్
మధిర: పలుచోట్ల రైల్వేస్టేషన్లలోకి వరద చేరడంతో రైళ్లు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే ముందుకు వెళ్లే పరిస్థితి లేక కాకినాడపోర్ట్ – షిర్డీ సాయినగర్ ఎక్స్‌ప్రెస్‌ను బుధవారం మఽధిర రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. సుమారు రెండు గంటల పాటు రైలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, చిన్నారులు తాగునీరు, ఇతర అవసరాలకు ఇబ్బంది పడ్డారు. మధిర ప్రెస్‌క్లబ్ బాధ్యులు బిస్కెట్ ప్యాకెట్లు అందజేశారు. ప్రెస్‌క్లబ్ గౌరవ సలహాదారుడు మిరియాల శ్రీనివాసరావు, అధ్యక్షుడు పాగి బాలస్వామితో పాటు బాధ్యులు సుంకర సీతారాం, పల్లపోతు ప్రసాదరావు, దుబాసి రాజేశ్, వేముల నవీన్‌కుమార్, దోసపాటి విజయ్, గణేశ్, జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్‌రెడ్డి, సీసీఎస్ సత్యనారాయణ, కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ రమేశ్, వివిధ సంఘాల బాధ్యులు సురేశ్, సాయి, సతీశ్, వనమా కిరణ్, కోనా జగదీశ్ పాల్గొన్నారు.


