విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
సత్తుపల్లి(పెనుబల్లి)/రఘునాథపాలెం: పెనుబల్లి మండలం టేకులపల్లి మోడల్ స్కూల్‌లో పదో తరగతి చదివి 579 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచిన శీలం జయశ్రీకి శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రతిభా పురస్కారం లభించింది. ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి చదివి ఉత్తమ మార్కులు సాధించిన వారికి పురస్కారాలు ప్రకటించగా జయశ్రీ రూ.30 వేల నగదు బహుమతి, జ్ఞాపిక అందుకుంది. ఆమెను ప్రిన్సిపాల్ టీబీ రూపన్, ఉపాధ్యాయులు అభినందించారు. అలాగే, రఘునాథపాలెంలోని గిరిజన గురుకుల ప్రతిభా పాఠశాల విద్యార్థి డేగావత్ సంజీవ్‌కు సైతం పురస్కారం లభించింది. 576 మార్కులతో మండల టాపర్‌గా నిలిచిన ఆయనకు నగదు బహుమతి, జ్ఞాపిక అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం కొల్లగట్టుతండాకు చెందిన శంకర్ – మంగమ్మ దంపతుల కుమారుడైన సంజీవ్.. తండ్రి మరణించినా తల్లి రెక్కల కష్టంతో చదువు కొనసాగించాడు. సంజీవ్‌ను ప్రిన్సిపాల్ మల్లెల బాలస్వామి, వైస్ ప్రిన్సిపాళ్లు నర్సింహారావు, శ్రీనివాసులు, ఉపాధ్యాయులు బుధవారం సన్మానించారు.
విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు


