నైరుతి సీజన్ తొలినాళ్లలో కొంత వెనకబాటు ఎదురైనా ఆ తర్వా
చేన్లలోనే ముద్దగా మారుతున్న పత్తి
వరి ధాన్యం తడుస్తుండడంతో రైతుల్లో ఆందోళన
నేడు, రేపు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
మబ్బులతో భయం..
తక్కువ ధరకే విక్రయించా..
మెడపై కత్తిలా
మోంథా...
లక్ష్యానికి మించి సాగు
జిల్లాలో జలవనరుల లభ్యతతో అన్ని పంటలు కలిపి 5,74,112.18 ఎకరాల్లో సాగు చేశారు. ఇందులో అత్యధికంగా 2,98,773.34 ఎకరాల్లో వరి, 2,51,980.28 ఎకరాల్లో పత్తి, 1,816.12 ఎకరాల్లో మొక్కజొన్న సాగయ్యాయి.
కాపాడుకోవడం ఎలా?
తుపాను ప్రభావం నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. సత్తుపల్లి, కూసుమంచి వ్యవసాయ డివిజన్లలో ముందుగా సాగు చేసిన వరి కోతలు ప్రారంభమయ్యాయి. సత్తుపల్లి వ్యవసాయ డివిజన్‌లో అత్యధికంగా 1.28 లక్షల ఎకరాల్లో, కూసుమంచి డివిజన్‌లో 74,969 ఎకరాల్లో వరి సాగైంది. ఈ డివిజన్లలోని కొన్నిచోట్ల పంట కోసి కల్లాల్లో ఆరబెడుతున్నారు. మరికొందరు మాత్రం తుపాను హెచ్చరికల నేపథ్యాన కోతలు వాయిదా వేస్తున్నారు.
తుపాన్ పంజా
మోంథా తుపాను జిల్లాపై విరుచుకుపడుతుందనే సమాచారంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మంగళవారం, బుధవారంతోపాటు గురువారం ఉదయం వరకు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఉరుములతో కూడిన వర్షంతోపాటు 40 – 50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించగా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాక రిజర్వాయర్లలోకి ఇన్‌ఫ్లో ఎప్పటికప్పుడు తెలుసుకునేలా ఏర్పాటుచేశారు. ఇక రైతులు కోసిన వరి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పుతున్నారు. పత్తి కూడా తడవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
జిల్లాలో పత్తి, వరిపై
తుపాన్ ప్రభావం
నాలుగెకరాల్లో వరి కోతకు వచ్చింది. మబ్బులు చూస్తే వరి కోయించాలంటే భయమేస్తోంది. ఒకవేళ కోసినా ఎక్కడ ఆరబోయాలో తెలియడం లేదు. అధికారులు త్వరగా కొనుగోళ్లు మొదలుపెట్టడమే కాక టార్పాలిన్లు అందించాలి.
– మరికంటి శంకర్, భైరవునిపల్లి,
నేలకొండపల్లి మండలం
అకాల వర్షాలతో ఆరపెట్టే సమయం లేక పచ్చిఽ ధాన్యమే అమ్మాను. ప్రభుత్వం కేంద్రాల్లో క్వింటాకు రూ.2,389కు తోడు రూ.500 బోనస్ ఇస్తున్నా తీసుకెళ్లే పరిస్థితి లేదు. దీంతో వ్యాపారులకు క్వింటా రూ.1,400 చొప్పున కల్లంలోనే అమ్మేశా.
– కందుల లక్ష్మణరావు, చెన్నూరు,
కల్లూరు మండలం
నైరుతి సీజన్ తొలినాళ్లలో కొంత వెనకబాటు ఎదురైనా ఆ తర్వా
నైరుతి సీజన్ తొలినాళ్లలో కొంత వెనకబాటు ఎదురైనా ఆ తర్వా
నైరుతి సీజన్ తొలినాళ్లలో కొంత వెనకబాటు ఎదురైనా ఆ తర్వా


