డిప్లొమా కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు
ఖమ్మంవైద్యవిభాగం: డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే గడువును నవంబర్ 27వరకు పొడిగించినట్లు ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.శంకర్ తెలిపారు. మెడికల్ కాలేజీలో డిప్లొమా ఇన్ అనస్తీషియా టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ ఇమేజింగ్ టెక్నీషియన్ కోర్సుల్లో 30 చొప్పున సీట్లు ఉన్నాయని వెల్ల డించారు. రెండేళ్ల కాల వ్యవధితో కొనసాగే ఈ కోర్సుల్లో బైపీసీ విద్యార్థులకు ప్రాధాన్యత ఉంటుందని, ఆతర్వాత ఎంపీసీ, ఇతర విద్యార్థులకు అవకాశం ఇస్తామని తెలిపారు. https://tspmb.telangana.gov దరఖాస్తు చేసుకుని, ఆ కాపీకి ధ్రువపత్రాలు కలిపి జత చేసి కళాశాలలో సమర్పించాలని, వివరాలకు https://gmc.khammam.org లో పరిశీలించాలని ప్రిన్సిపాల్ సూచించారు.
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాల నియంత్రణ
● ఓపెన్ హౌస్‌లో సీపీ సునీల్‌దత్
ఖమ్మంక్రైం: ప్రజల సంక్షేమం, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారని, తద్వారా నేరాలు నియంత్రణలో ఉన్నాయని పోలీసు కమిషనర్ సునీల్‌దత్ తెలిపారు. అమరవీరుల సంస్మరణ దినోత్సవాల(ఫ్లాగ్ డే)ను పురస్కరించుకుని మంగళవారం ఖమ్మంలోని సిటీ ఆర్మ్‌డ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటుచేసిన ఓపెన్ హౌస్‌ను ఆయన ప్రారంభించారు. కేసుల విచారణలో ఫింగర్ ప్రింట్ యూనిట్, బాంబ్ డిస్పోజల్, డాగ్ స్క్వాడ్ పనితీరు, బ్రీత్ ఎనలైజర్ పరికరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాక సీపీ మాట్లాడారు. ఏఆర్ అడిషనల్ డీసీపీ కుమారస్వామి, ఏసీపీలు నర్సయ్య, సుశీల్‌సింగ్, ఆర్‌ఐ కామరాజు, శ్రీశైలం, సురేష్, సాంబశివరావు, సీఐ నరేష్, ఐటీ విభాగం ఉద్యోగి హేమనాధ్ పాల్గొన్నారు.
‘భవిత’ కేంద్రాల్లో ఆరోగ్యం, విజ్ఞానం
కొణిజర్ల: భవిత కేంద్రాల ద్వారా ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల ఆరోగ్యం మెరుగుపరుస్తూనే విజ్ఞానం పెంపొందించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. కొణిజర్లలోని భవిత కేంద్రంలో మరమ్మతు పనులు, సౌకర్యాల కల్పనను మంగళవారం ఆమె పరిశీలించారు. రూ.6.75 లక్షలతో టాయ్‌లెట్లు నిర్మించడమే కాక పెయింటింగ్ వేస్తుండగా పరిశీలించి సూచనలు చేశారు. చిన్నారులకు సౌకర్యవంతంగా ఉండేలా నిర్మాణాలు నాణ్య తగా చేయించాలని ఆదేశించారు. ఎంఈఓ అబ్రహం, ఎంపీఓ ఉపేంద్రయ్య ఉన్నారు.
డిప్లొమా కోర్సుల దరఖాస్తు గడువు పొడిగింపు


