మంత్రి పొంగులేటి జన్మదిన వేడుకలు
కల్లూరురూరల్: రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పుట్టిరోజు వేడుకలను మంగళవారం జిల్లాలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధుల ఆధ్వర్యాన నిర్వహించారు. పలుచోట్ల పేదలకు అన్నదానం చేయడంతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటుచేశారు. మంత్రి స్వగ్రామమైన కల్లూరు మండలం నారాయణపురంలో ఆయన తల్లి స్వరాజ్యమ్మ కేక్ కట్ చేశారు. కల్లూరు మార్కెట్ చైర్మన్ భాగం నీరజాదేవి, నాయకులు అంకిరెడ్డి సత్యనారాయణరెడ్డి, కనకదుర్గమ్మ, భాగం ప్రభాకర్, కాటేపల్లి కిరణ్‌కుమార్, రవికుమార్, తక్కెళ్లపల్లి దుర్గాప్రసాద్, కీసర శ్రీనివాసరెడ్డి, లక్కిరెడ్డి ఏసురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


