బకాయిలు చెల్లించకుంటే ఆందోళనలు ఉధృతం
ఖమ్మం సహకారనగర్: పెన్షనర్ల బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం సత్వరం చెల్లించాలని, లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని పలువురు వక్తలు అన్నా రు. రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సంఘం(ఎస్‌జీపీఏటీ) జిల్లా అధ్యక్షుడు పరిశ పుల్లయ్య అధ్యక్షతన సోమవా రం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మద్దతు తెలిపి మాట్లాడారు. పెన్షనర్ల పట్ల ప్రభుత్వ తీరుతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కొందరికి చికిత్స అందక మృతిచెందుతున్నారని తెలిపారు. దాదాపు 18 నెలలుగా బకాయిలు చెల్లించకపోవడం సరి కాదని చెప్పారు. తొలుత ధర్నాను సంఘం రాష్ట్ర కార్యదర్శి మేరీ ఏసుపాదం ప్రారంభించగా కలెక్టరేట్‌లో డీఆర్వో కు వినతిపత్రం సమర్పించారు. వివిధ పార్టీలు, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల నాయకులు బాగం హేమంతరావు, గోకినేపల్లి వెంకటేశ్వరరావు, కె.విజయ్, వి. మనోహర్‌రాజు, ఎస్.కే.కరీం, కళ్యా ణం నాగేశ్వరరావు, ఆవుల అశోక్, ఏ.విద్యాసాగర్, జల్లా వెంకటేశ్వర్లు, రాయల రవికుమార్, ఐవీ.భాస్కరాచారి, శ్యాంసుందర్, జి.లక్ష్మయ్య, భద్రయ్య, గుర్రాల శ్రీనివాసరావు, పెదమళ్ల సత్యనారాయణ, కె.శరత్‌బాబు, ఊడుగు వెంకటేశ్వర్లు, బోజడ్ల కృష్ణకుమారి, తాడి అంజలి, లక్ష్మీసుజాత, అన్నమ్మ, రాధాకృష్ణమూర్తి, ప్రసాదరావు పాల్గొన్నారు.


