దేశ సేవే బీజేపీ ప్రధాన ధ్యేయం
ఖమ్మం మామిళ్లగూడెం: దశసేవే భారతీయ జనతా పార్టీ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు తెలిపారు. ‘బీజేపీ సిద్ధాంతం – సంస్థాగత అంశాలు’ అంశంపై జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావు అధ్యక్షతన సోమవారం ఖమ్మంలో నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. బీజేపీ కేవలం ఒక పార్టీ కాదని, దేశసేవకు అంకితమైన జాతీయ ఉద్యమ స్వరూపమని తెలి పారు. అధికారం కంటే సేవాభావం ముఖ్యమనే అంశాన్ని కార్యకర్తలు గుర్తించాలని సూచించారు. సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకుంటున్న నిర్ణయాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలని తెలిపారు. అంతేకాక బూత్ స్థాయి వరకు పార్టీ బలపడేలా శ్రమించాలని వాసుదేవరావు సూచించారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా, మండలాల నాయకులు పాల్గొన్నారు.
విధుల్లోకి ఆరుగురు
ఎంపీడీఓలు
ఖమ్మం సహకారనగర్: ఇటీవల గ్రూప్–1 ద్వారా ఎంపీడీఓలుగా ఎంపికై న ఆరుగురిని జిల్లాకు కేటాయించారు. వీరికి సోమవారం కలెక్టర్ పోస్టింగ్ ఇవ్వగా బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు కూసుమంచిలో టి.జశ్వంత్, ఏన్కూరులో పి.భాగ్యశ్రీ, కొణిజర్లలో జి.వర్ష, వేంసూరులో డి.కావ్య, తల్లాడలో డి.సోనియా, ఖమ్మం రూరల్ ఎంపీడీఓగా కె.రవికుమార్ విధుల్లో చేరారు.
రాష్ట్ర కోశాధికారి వాసుదేవరావు


