దరఖాస్తులకు సత్వర పరిష్కారం
ఖమ్మం సహకారనగర్: ప్రజావాణిలో ప్రజలు ఇచ్చే దరఖాస్తులకు సత్వర పరిష్కారం చూపించాలని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ అధికారులను ఆదేశించా రు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన గ్రీవెన్స్ డేలో ఆమె అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. అనంతరం అధికారులతో సమావేశమైన శ్రీజ మాట్లాడు తూ ఫిర్యాదులను వీలైనంత త్వరగా పరిష్కరించాలని తెలిపారు. ఏవైనా దరఖాస్తులు తిరస్కరిస్తే అందుకు కారణాలు తెలియచేయాలని సూచించారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్‌డీఓ సన్యాసయ్య, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
పెన్షన్ ఇప్పించండి
దివ్యాంగుడైన తన కుమారుడు కొండపల్లి యల్ల య్య పదేళ్లుగా వస్తున్న పింఛన్‌ను ఇటీవల నిలిచివేశారని ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంకుకు చెందిన సాలమ్మ, ఫిర్యాదు చేశారు. అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన పెన్షన్‌ను పునరుద్ధరించాలని కోరింది.
ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీజ
దరఖాస్తులకు సత్వర పరిష్కారం


