చేతి వృత్తులకు చేయూతనిద్దాం..
ఖమ్మంమామిళ్లగూడెం: స్థానిక చేతివృత్తిదారులను ఆదుకోవడం ద్వారా స్వదేశీ ఆర్థిక వ్యవస్థకు బలం చేకూరుతుందని బీజేపీ జాతీయ నాయకుడు, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల కోఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన ఖమ్మం మేదరబజార్ ప్రాంతాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు నెల్లూరు కోటేశ్వరరావుతో కలిసి సందర్శించారు. చేతివృత్తిదారులు తయారు చేస్తున్న వెదురు ఉత్పత్తులను పరిశీలించారు. స్థానిక కళాకారులు కనికరపు విజయలక్ష్మి, నాగేశ్వరరావు తదితరులు తయారు చేసిన వెదురు బుట్టలు, అలంకార వస్తువులను కొనుగోలు చేసి, మాట్లాడారు. దేశాభివృద్ధి అంటే కేవలం సాంకేతిక రంగం కాదని, ప్రతి వృత్తిదారుడి కృషి కూడా ఉంటుందని తెలిపారు. ప్రధాని మోదీ పిలుపుమేరకు ప్రతి భారతీయుడు స్వదేశీ వస్తువులనే వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి డి.వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శులు నల్లగట్టు ప్రవీణ్‌కుమార్, నాయుడు రాఘవరావు, నాయకులు నున్న రవికుమార్, రంగా కిరణ్, గడిల నరేశ్, పాలెపు రాము, ఏలూరి నాగేశ్వరరావు, రుద్రప్రదీప్, గుగులోతు నాగేశ్వరరావు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం బీజేపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోని ముగ్గురు మంత్రులు ప్రజలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. సత్తుపల్లిలో బీసీ బంద్ సందర్భంగా బీజేపీ కార్యకర్తలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ సందర్భంగా వైరాకు చెందిన టీజేఏసీ వైరా మండల అధ్యక్షుడు షేక్ పాషా పార్టీలో చేరగా సుధాకర్‌రెడ్డి కండువా కప్పారు. అనంతరం శ్రీరక్ష వైద్యశాలలో చికిత్స పొందుతున్న బానోతు విజయను పరామర్శించారు, తర్వాత 57వ డివిజన్‌లోని కనమర్లపూడి ఉపేందర్ ఇంటి వద్ద మన్‌కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. దొంగల సత్యనారాయణ, కిరణ్, వెంకటేశ్వరరావు, రామలింగేశ్వరరావు, నలగట్టు ప్రవీణ్ కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జాతీయ నాయకుడు
పొంగులేటి సుధాకర్‌రెడ్డి


