తాగునీటి సరఫరా ఎలా జరుగుతోంది?
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో తాగునీటి సరఫరా విధానాన్ని మిర్యాలగూడ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, అధికారులు పరిశీలించారు. 24 గంటల పాటు నీటి సరఫరా కోసం కేఎంసీలో చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించాలన్న ప్రిన్సిపల్ సెక్రటరీ, సీడీఎంఏ శ్రీదేవి ఆదేశాలతో మిర్యాలగూడ బృందం శనివారం ఖమ్మం వచ్చింది. తొలుత కమిషనర్ అభిషేక్ అగస్త్యను మర్యాదపూర్వకంగా కలిశాక, పబ్లిక్ హెల్త్ ఏఈఈ దివ్య ఆధ్వర్యాన అల్లీపురం, రోటరీనగర్ ప్రాంతాల్లో చేపట్టిన పనులను పరిశీలించారు. ఈ పర్యటనలో ఖమ్మం పబ్లిక్ హెల్త్ ఏఈ అనిత, మిర్యాలడ మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు నవీన్, సాయితేజ ఉన్నారు. కాగా, 24 గంటల పాటు నీటి సరఫరా కోసం జరుగుతున్న పనులు చివరి దశకు చేరడంతో అన్ని మున్సిపాలిటీల నుంచి అధికారులు పరిశీలించాలని ఉన్నతాధికారులు సూచిస్తున్నారు.
కేఎంసీలో మిర్యాలగూడ బృందం పరిశీలన


