మందుబాబులకు వినూత్న శిక్ష
ఖమ్మంక్రైం: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన ఏడుగురికి రూ.2వేల చొప్పున ఖమ్మం స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి బక్కెర నాగలక్ష్మి శనివారం తీర్పు చెప్పారు. అంతేక రెండు రోజుల పాటు ట్రాఫిక్ పోలీసులకు విధుల్లో సహకరించాలని ఆదేశించారని ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ తెలిపారు. నిర్ణీత తేదీల్లో ఖమ్మంలో ఉదయం 10నుంచి సాయంత్రం 5వరకు ట్రాఫిక్ విధుల ద్వారా కమ్యూనిటీ సేవ చేయాలని తీర్పులో వెల్లడించారని సీఐ పేర్కొన్నారు.
చికిత్స పొందుతున్న మహిళ మృతి
సత్తుపల్లిటౌన్: కుటుంబ కలహాలతో పిల్లలకు కలుపు మందు తాగించి తానూ తాగిన మహిళ వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. సత్తుపల్లి ద్వారకాపురి కాలనీకి చెందిన పఠాన్ సల్మా(29) శుక్రవారం తన చిన్నకుమారుడు సయాన్(6)కి కలుపు మందు తాగించింది. మరో కుమారుడికి సైతం తాగించినా ఆ బాలుడు ఉమ్మేశాడు. దీంతో అపస్మారక స్థితికి చేరిన సల్మా, సయాన్‌ను ఖమ్మం ఆస్పత్రిలో చికిత్స అనంతరం వరంగల్ తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సల్మా మృతి చెందగా.. కుమారుడు సయాన్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతుండగా, భర్తలో మార్పు రావడం లేదని సల్మా ఈ నిర్ణయం తీసుకుందని బంధువులు తెలిపారు. ఈమేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
విషమంగానే కొడుకు పరిస్థితి


