సకాలంలో సిలబస్ పూర్తి చేయాలి
తిరుమలాయపాలెం: విద్యార్థులు క్రమం తప్పకుండా కళాశాలకు హాజరయ్యేలా పర్యవేక్షిస్తూనే అన్ని సబ్జెక్టుల సిలబస్ సకాలంలోని పూర్తి చేయాలని జిల్లా ఇంటర్మీడిఝెట్ విద్యాశాఖ అధికారి కె.రవిబాబు సూచించారు. మండలంలోని పిండిప్రోలు జూనియర్ కళాశాలను శనివారం తనిఖీ చేసిన ఆయన మరమ్మతు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆతర్వాత అధ్యాపకులతో సమావేశమైన డీఐఈఓ.. విద్యార్థుల హాజరు, బోధనపై సూచనలు చేశారు. అనంతరం ఈ నెలాఖరులో ఉద్యోగ విరమణ చేయనున్న ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును సన్మానించారు. ఆతర్వాత హార్ట్ పుల్‌నెస్ సంస్థ బాధ్యుడు కరుణాకర్ విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని అధిగమించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.


