జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఇప్పటికే స్టార్‌ క్యాంపెయినర్లను ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్‌ నుంచి డిప్యూటీ సీఎం మల్లు | - | Sakshi
Sakshi News home page

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ప్రచారంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ ఎన్నికను కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఇప్పటికే స్టార్‌ క్యాంపెయినర్లను ప్రకటించాయి. ఇందులో కాంగ్రెస్‌ నుంచి డిప్యూటీ సీఎం మల్లు

Oct 26 2025 8:21 AM | Updated on Oct 26 2025 8:21 AM

జిల్ల

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్

బీఆర్‌ఎస్‌ నుంచి పువ్వాడ, వద్దిరాజు, మధు అక్కడి ప్రధాన సామాజికవర్గాల ఓట్లపై పార్టీల నజర్‌ అదేవర్గం నేతలతో జోరుగా ప్రచారం

వచ్చేనెల 9వ తేదీ వరకు అక్కడే..

జూబ్లీహిల్‌ ్స

జిల్లా మంత్రులకు బాధ్యతలు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక బాధ్యతలను కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ముఖ్యనేతలకు అప్పగించింది. ఈమేరకు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు స్టార్‌ క్యాంపెయినర్లుగా జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. కేడర్‌ను సమన్వయం చేసుకుంటూ ఎక్కడెక్కడ ప్రచారం చేయాలనే అంశంపై సూచనలు చేస్తూనే, మంత్రులు నేరుగా ప్రధాన సభలతో పాటుగా అభ్యర్థితో కలిసి రోడ్డు షోల్లో పాల్గొంటున్నారు. అలాగే, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ రాయల నాగేశ్వరరావు, ఐడీసీ చైర్మన్‌ మువ్వా విజయ్‌బాబు, కాంగ్రెస్‌ నాయకుడు ఎండీ.ముస్తఫా తదితరులు సైతం ప్రచారానికి హాజరవుతున్నారు..

బీఆర్‌ఎస్‌ నేతలు సైతం..

ఉప ఎన్నికలో అభ్యర్థుల జాబితా ఖరారవడంతో బీఆర్‌ఎస్‌ ప్రచారంపై దృష్టి సారించింది. ఈమేరకు ప్రచారం చేసే స్టార్‌ క్యాంపెయిన్లలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుకు చోటు కల్పించింది. అలాగే ఖమ్మం నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, మైనార్టీ నాయకుడు తాజుద్దీన్‌ సైతం ప్రచారానికి వెళ్లారు. నేతలు తమకు కేటాయించిన ప్రాంతాల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి తరఫున ప్రచారం చేస్తుండగా, స్టార్‌ క్యాంపెయినర్లు సభలు, రోడ్‌ షోల్లో పాల్గొనడమే కాక ప్రచారాన్ని సమన్వయం చేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలను చెబుతూ, కాంగ్రెస్‌ వచ్చాక అభివృద్ధిపై నిర్లక్ష్యం చేస్తోందని వివరిస్తున్నారు.

కాంగ్రెస్‌ పార్టీ ప్రచార జాబితాలో డిప్యూటీ సీఎం, మంత్రులు

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోలింగ్‌కు 17 రోజుల సమయం ఉండగా, ముఖ్యనేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రచారంలో తలమునమకలయ్యారు. రెండు పార్టీల నాయకులు వారం, పది రోజులుగా అక్కడే మకాం వేసి ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఈనెల 9 వరకు నేతలంతా అక్కడే ఉండనున్నట్లు చెబుతున్నారు. కాగా, జిల్లా ముఖ్యనేతలు ప్రచారంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. జూబ్లీ హిల్స్‌ నియోజకవర్గంలో ఏయే సామాజిక వర్గాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయో గుర్తించి.. ఆ సామాజిక వర్గం నేతలను పార్టీలు ప్రచారానికి ఆహ్వానించాయి. అంతేకాక ఉమ్మడి జిల్లా నుంచి జూబ్లీ హిల్స్‌లో ఎవరు ఓటర్లుగా ఉన్నారో ఆరా తీయడం.. ఇక్కడి ప్రజల బంధువులను గుర్తిస్తూ వారితోనూ చెప్పిస్తున్నారు. సామాజికవర్గాలు, కుల సంఘాల వారీగా జరిగే సమావేశాల్లోనూ జిల్లా నేతలు పాల్గొంటున్నారు.

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్1
1/6

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్2
2/6

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్3
3/6

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్4
4/6

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్5
5/6

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్6
6/6

జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీల ముఖ్య నేతలు జూబ్లీహిల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement