విద్యార్థుల ప్రగతికి అనుగుణంగా బోధన
కొణిజర్ల: పాఠ్యాంశాల్లో విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అందుకు అనుగుణంగా బోధించాలని గిరిజన సంక్షేమ గురుకులాల ఆర్‌సీఓ(రీజినల్ కోఆర్డినేటర్) ఏ.అరుణ సూచించారు. తనికెళ్లలోని గిరిజన సంక్షేమ మహిళా గురుకుల డిగ్రీ కళాశాలను శనివారం ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డార్మెటరీ, కిచెన్ షెడ్, భోజనశాల, సిక్‌రూమ్‌ను పరిశీలించి సదుపాయాలపై విద్యార్థినులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అధ్యాపకులతో సమావేశమైన ఆర్‌సీఓ మాట్లాడుతూ విద్యార్థుల చదువుకు ఆటంకాలు రాకుండా చూడాలని తెలిపారు. ప్రిన్సిపాల్ కె.రజని, వైస్ ప్రిన్సిపాల్ ఎం.నవ్య, అధ్యాపకులు డాక్టర్ కే.పీ.ఐశ్వర్య, కె.రజిత, బి.రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
నిర్ణీత వ్యవధిలో లక్ష్యసాధన
ఖమ్మంక్రైం: వాహనాల త్రైమాసిక పన్నులు, ఇతర ఆదాయ లక్ష్యాలను నిర్ణీత వ్యవధిలో చేరుకోవాలని రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ సురేష్‌రెడ్డి సూచించారు. జిల్లా రవాణాశాఖా కార్యాలయానికి శనివారం వచ్చిన ఆయన జిల్లాలో రవాణా శాఖ కార్యాలయాల పని తీరు, పన్నుల వసూళ్లు, రోజువారీ రిజిష్ట్రేషన్లపై జిల్లా రవాణా శాఖాధికారి వెంకటరమణతో సమీక్షించారు. అలాగే, పెనుబల్లి మండలం ముత్తగూడెంలో తొలగించిన చెక్‌పోస్ట్‌కు సంబంధించి సిబ్బందికి కేటాయించిన విధులపై ఆరా తీశారు. కార్యాలయాల్లోకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏజెంట్లను అనుమతించవద్దని సూచించారు. ఏఓ సుధాకర్, ఏఎంవీఐ స్వర్ణలత, ఉద్యోగులు పాల్గొన్నారు.
యాప్‌లో స్లాట్ బుకింగ్ తప్పనిసరి
రఘునాథపాలెం: పత్తి రైతులు సీసీఐ కేంద్రాల్లో పంట అమ్మకానికి కపాస్ కిసాన్ యాప్‌లో స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య రైతులకు సూచించారు. రఘునాథపాలెం మండలంలోని చిమ్మపూడిలో యూరియా పంపిణీని శనివారం పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడారు. పత్తి సాగు చేసిన ప్రతీ రైతు కపాస్ కిసాన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని, తద్వారా సీసీఐ సెంటర్లలో మద్దతు ధరతో అమ్ముకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. అంతేకాక మోతాదుకు మించి నత్రజని ఎరువులు వాడొద్దని సూచించారు. మొక్కజొన్న విత్తన సాగు చేసే రైతులు తప్పనిసరిగా కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవాలని తెలిపారు. మండల వ్యవసాయ అధికారి కర్నాటి ఉమామహేశ్వరరెడ్డి, రైతులు పాల్గొన్నారు.
అందరికీ న్యాయం పొందే హక్కు
ఖమ్మం లీగల్: న్యాయం అందరికీ సమానమేనని, దీన్ని పొందే హక్కు ప్రతీ ఒక్కరికి ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి కే.వీ.చంద్రశేఖరరావు తెలిపారు. ఖమ్మం ఆర్‌డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్‌ను శనివారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. వయో వృద్ధుల కోసం ఉచిత న్యాయం అందుబాటులో ఉంటుందని, ఈ కేంద్రంలో పారా లీగల్ వలంటీర్లు దరఖాస్తులు స్వీకరిస్తారని తెలిపారు. అనంతరం ఆర్‌డీఓ నర్సింహారావు మాట్లాడుతూ వయోవృద్ధుల పోషణ అంశం తమ పరిధిలో ఉండగా, భూతగాదాలు, గిఫ్ట్ డీడ్లు కలెక్టర్ పరిధిలోకి వస్తాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పారా లీగల్ వలంటీర్ నాగమణి తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థుల ప్రగతికి అనుగుణంగా బోధన
విద్యార్థుల ప్రగతికి అనుగుణంగా బోధన
విద్యార్థుల ప్రగతికి అనుగుణంగా బోధన


