రేపటి నుంచి పాఠశాలల్లో ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’
ఖమ్మం సహకారనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలందరిలో ఇంగ్లిష్ పఠనా సామర్థ్యం పెంపొందించాలనే లక్ష్యంతో సోమవారం నుంచి ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఖమ్మం నుంచి శనివారం ఆయన ఎంఈఓలు, హెచ్‌ఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. అన్ని ప్రాథమిక పాఠశాలల్లో సోమవారం నుంచి కార్యక్రమం మొదలవుతుందని, ప్రతీరోజు గంట పాటు విద్యార్థుల్లో రీడింగ్ స్కిల్స్ పెంచేలా ఉపాధ్యాయులు తర్ఫీదు ఇవ్వాలని చెప్పారు. మధ్యాహ్నం 3నుంచి 4గంటల వరకు 1 – 5వ తరగతి పిల్లలతో ఇంగ్లిష్ చదివించేలా ప్రత్యేక కోర్సు సిద్ధం చేశామని తెలిపారు. సులువైన పదాలతో ప్రారంభించి సరళంగా ఆంగ్లం చదవడం వచ్చేలా ఈ మెటీరియల్ ఉంటుందని వెల్లడించారు. ప్రతీ బుధవారం విద్యార్థి సామర్థ్యాలు ఏ మేర ఉన్నాయో యాప్‌లో నమోదు చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యా శాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ సీ.హెచ్.రామకృష్ణ, సీఎంఓ ప్రవీణ్, ఏఎంఓ ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ అనుదీప్


