‘బతుకమ్మ’ చాలెంజ్‌లో స్థానం
నేలకొండపల్లి: తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యాన బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ చాలెంజ్–2025 పేరిట నిర్వహించిన పోటీల తుదిజాబితాలో మండలంలోని మంగాపురం తండా వాసి రూపొందించిన షార్ట్ ఫిల్మ్‌కు చోటు దక్కింది. కాంగ్రెస్‌ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అమలుచేస్తున్న పథకాలతో పాటు తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఆధారంగా రూపొందించిన షార్ట్‌ఫిల్మ్‌లను పోటీకి ఆహ్వానించారు. ఈమేరకు మంగాపురంతండాకు చెందిన గుగులోత్ నాగేంద్రవర్మ డైరెక్టర్‌గా, గుగులోత్ రూప్లానాయక్ నిర్మాణంలో శ్రీజయకేతనంశ్రీపేరిట షార్ట్ ఫిల్మ్‌ను రూపొందించగా పోటీలో తుది జాబితాలో చోటు దక్కింది. ఈ విషయాన్ని వెల్లడించిన డైరెక్టర్, నిర్మాత మాట్లాడుతూ విజేతల జాబితాలోనూ స్థానం దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.


