సస్పెన్షన్ రద్దు చేయాలని నిరసన
ఖమ్మం సహకారనగర్: టీఎస్ యూటీఎఫ్ తిరుమలాయపాలెం మండల అధ్యక్షుడు, ఎర్రగడ్డ యూపీఎస్ ఉపాధ్యాయుడు భూక్యా కేశ్యాపై విధించిన సస్పెన్షన్‌ను రద్దు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చావా దుర్గాభవాని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యాన ఖమ్మంలోని భక్త రామదాసు కళాక్షేత్రం వద్ద గురువారం నిరసన తెలపగా ఆమె మాట్లాడారు. ఐటీఐ ఏర్పాటు చేయాలని జరిగిన దీక్షకు భోజన విరామ సమయాన సంఘీభావం తెలిపితే సస్పెండ్ చేయడం సరికాదని పేర్కొన్నారు. ఈమేరకు అధికారులు వాస్తవాలను పరిశీలించి సస్పెన్షన్‌ను ఎత్తివేయాలన్నారు. అనంతరం అదనపు కలెక్టర్, డీఈఓ శ్రీజకు వినతిపత్రం సమర్పించారు. టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు, నాయకులు బుర్రి వెంకన్న, షమీ, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


