భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక గురువారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం,ఆరాధన తదితర పూజలు చేశారు.అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
26న క్రీడా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లా పాఠశాలల క్రీడల సంఘం ఆధ్వర్యాన ఈనెల 26వ తేదీన ఉమ్మడి జిల్లా స్థాయి అండర్–14, 17 క్రీడా జట్లను ఎంపిక చేయనున్నట్లు కార్యదర్శి వై,రామారావు తెలిపారు. లాన్ టెన్నిస్, స్కేటింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్, జూడోలో బాలబాలికల ఎంపిక పోటీలు సర్దార్ పటేల్ స్టేడియంలో జరుగుతాయని, క్రీడాకారులు వయసు ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 10 గంటలకల్లా హాజరు కావాలని సూచించారు.
‘తెలంగాణ రైజింగ్’పై సిటిజన్ సర్వే..
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర పురోగతికి మార్గనిర్దేశం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ విజన్–2047’అనే దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికను సిద్ధం చేస్తోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా ప్రజల ఆకాంక్షలు, ప్రాధాన్యతలు, ఆలోచనలను సంగ్రహించడానికి సిటిజన్ సర్వే ప్రారంభించింది. ఈ నేపథ్యాన ఖమ్మం డిపో ఉద్యోగులు, బస్టాండ్‌లోని ప్రయాణికులు కూడా పాల్గొనేలా క్యూఆర్ కోడ్ స్కానర్‌ను అందుబాటులో ఉంచారు. ప్రతి ఒక్కరూ ఈ సర్వేలో పాల్గొనాలని ఆర్టీసీ అధికారులు కోరుతున్నారు.
స్కూళ్లలో వసతులకు ప్రతిపాదనలు
విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజీవ్
ఖమ్మం సహకారనగర్: మధిర నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ప్రతిపాదనలు సమర్పించాలని విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ రాజీవ్, అదనపు కలెక్టర్, డీఈఓ డాక్టర్ పి.శ్రీజ సూచించారు. ఖమ్మం భక్తరామదాసు కళాక్షేత్రంలో గురువారం మధి ర నియోజకవర్గ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై వారు హెచ్‌ఎంలతో సమీక్షించారు. ఈ సందర్భంగా రాజీవ్, శ్రీజ మాట్లాడుతూ అన్ని పాఠశాలల్లో అవసరమైన పనులు చేపట్టేలా ప్రతిపాదనలు అందించాలని తెలిపారు. తద్వారా నిధులు మంజూరవుతాయని వెల్లడించారు. ఈ సమావేశంలో ఉద్యోగులు శశిధర్, రామకృష్ణ, హెచ్‌ఎంలు, హాస్టళ్ల వార్డెన్లు పాల్గొన్నారు.
ప్రయాణికులకు
ఆత్మీయ స్వాగతం !
ఆర్టీసీ అధికారుల వినూత్న కార్యక్రమం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


