● పత్తి చే‘జారి’పోతోంది..!
జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం
మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయం కాగా, రైతులకు నష్టం జరిగినట్లయింది. ఈ ఏడాది పత్తి సాగులో మొదటి నుంచి అవాంతరాలు వస్తుండగా దిగుబడి తగ్గుతోంది. ఇంతలోనే భారీ వర్షం కురవడంతో రైతుల ఆశలు ఆవిరయ్యాయి. చెట్ల నుంచి పత్తి కారి పోతుండగా, మరో రెండు రోజుల పాటు వర్షం ఉంటే పత్తి చేజారినట్లేనని చెబుతున్నారు. మిగిలిన పత్తి కూడా నల్లబడి మద్దతు ధర దక్కదని ఆవేదన చెందుతున్నారు. ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ఈమేరకు ప్రభుత్వం స్పందించి రంగు మారిన పత్తిని కూడా సీసీఐ ద్వారా మద్దతు ధరతో కొనుగోలు చేయించాలని కోరుతున్నారు. అలాగే, పలుచోట్ల వరి చేన్లు కూడా నేలవాలాయి. – కొణిజర్ల / ఏన్కూరు / తల్లాడ /తిరుమలాయపాలెం
● పత్తి చే‘జారి’పోతోంది..!


