నా ‘అన్న’ వారు రాకున్నా...
రఘునాథపాలెం: అనారోగ్యంతో మృతి చెందిన వ్యక్తి అంత్యక్రియలను గ్రామస్తుల సహకారంతో ఆయన మిత్రులు నిర్వహించారు. రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంకు చెందిన అడ్డగిరి రాంప్రసాద్(35) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం మృతి చెందాడు. ఆయన తల్లిదండ్రులు గతంలోనే మృతి చెందగా, మరో గ్రామంలో ఉంటున్న సోదరుడికి సమాచారం ఇచ్చినా రాలేదు. దీంతో రాంప్రసాద్ స్నేహితులైన మడ్డాల నవీన్, కందుకూరి నాగ, గంగవరపు వెంకటేశ్వరరావు, వీరముష్టి వెంకన్న, టంగుటూరి మహేష్ తదితరులు ముందుకొచ్చి ఆయన అంత్యక్రియలను గురువారం నిర్వహించారు. అంతేకాక గ్రామస్తులు పలువురు ఆర్థిక సాయం అందజేశారు.
స్నేహితుడి అంత్యక్రియలు నిర్వహించిన బృందం
నా ‘అన్న’ వారు రాకున్నా...


