ప్రకృతి పూజ.. గొప్ప సంస్కృతి | - | Sakshi
Sakshi News home page

ప్రకృతి పూజ.. గొప్ప సంస్కృతి

Sep 24 2025 5:29 AM | Updated on Sep 24 2025 5:29 AM

ప్రకృ

ప్రకృతి పూజ.. గొప్ప సంస్కృతి

బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్‌ అనుదీప్‌

ఖమ్మం వైద్యవిభాగం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించే పండుగ బతుకమ్మ అని.. ప్రకృతిని పూజించడం ఈ పండుగలో గొప్పతనమని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి అన్నారు. బతుకమ్మ వేడుకలను మూడో రోజైన మంగళవారం కలెక్టరేట్‌లో వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యాన నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి కలెక్టర్‌ పాల్గొనగా.. ఆయన సతీమణితో కలిసి పూజలు చేశారు. డీఎంహెచ్‌ఓ కళావతిబాయి, కలెక్టరేట్‌లోని అన్ని శాఖల మహిళా ఉద్యోగులు, మహిళా ప్రాంగణం విద్యార్థినులు ఉత్సాహంగా బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు.

సమగ్ర విద్య అందించడమే లక్ష్యం

ఖమ్మం సహకారనగర్‌: ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్ణులకు సమగ్ర విద్య అందించడమే లక్ష్యంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సూచించారు. కలెక్టరేట్‌లో మంగళవారం విద్యాశాఖపై సమీక్షించిన ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధికి ఇస్తున్న ప్రాధాన్యతకు అనుగుణంగా ఉపాధ్యాయులు, ఉద్యోగులు పనిచేయాలని తెలిపారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమలులో దిగువన ఉన్న పది కాంప్లెక్స్‌ సీఆర్‌పీలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. అలాగే, విద్యా ప్రమాణాల పెంపునకు ఎఫ్‌ఎల్‌ఎన్‌ పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. దసరా సెలవుల తర్వాత ప్రతీ వారం డీఈఓ, ఇతర అధికారుల ఆధ్వర్యాన పాఠశాలలను తనిఖీ చేయాలని చెప్పారు. అంతేకాక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులందరికీ నెలలోగా ఆధార్‌ కార్డు, అపార్‌, కుల ధ్రువీకరణ పత్రం జారీ చేయించేలా ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు. కాగా, సెలవుల్లోనే భవనాలకు అవసరమైన మరమ్మతులు చేయించి ప్రీ ప్రైమరీ విద్యాసంస్థలను ప్రారంభించాలని తెలిపారు. అనంతరం మధ్యాహ్న భోజనం నాణ్యత, ఉపాధ్యాయుల సర్దుబాటు, 1 నుంచి 5వ తరగతి పిల్లలు ప్రతిరోజు గంట పాటు చదివించడం(రీడింగ్‌ అవర్‌)పై కలెక్టర్‌ సూచనలు చేశారు. ఈ సమావేశంలో కేఎంసీ అభిషేక్‌ అగస్త్య, విద్యాశాఖ ప్లానింగ్‌ కోఆర్డినేటర్‌ రామకష్ణ, ఎంఈఓలు, కాంప్లెక్స్‌ హెచ్‌ఎంలు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

ప్రకృతి పూజ.. గొప్ప సంస్కృతి1
1/1

ప్రకృతి పూజ.. గొప్ప సంస్కృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement