
మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు
ఎర్రుపాలెం: తెలంగాణ తిరుపతిగా పేరున్న జమలాపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. శ్రీవారికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పద్మావతి అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించారు. ఈ సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు దర్శించుకోగా, మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు. ఆలయ ఈఓ జగన్మోహన్‌రా వు, చైర్మన్ ఉప్పల శ్రీరామచంద్రమూర్తి, ప్రధా నార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, ముఖ్య అర్చకులు ఉప్పల మురళీమోహన్‌శర్మ, వేదపండితులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఉత్తమ ఫలితాల
సాధనే లక్ష్యం
ఖమ్మం సహకారనగర్: ఉత్తమ ఫలితాలు సాధించడమే లక్ష్యంగా విద్యార్థులు శ్రద్ధతో చదవాలని, తద్వారా అధ్యాపకులు, తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక అధికారి హేమచందర్ సూచించారు. ఖమ్మం ఏఎస్‌ఆర్ శాంతినగర్ జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన పేరెంట్ – టీచర్ సమావేశంలో ఆయన డీఐఈఓ రవిబాబు, డీఎంహెచ్‌ఓ కళావతిబాయితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణ, ప్రణాళికాయతంగా చదివితే లక్ష్యసాధన సులువవుతుందని తెలిపారు. ఇటీవల రెడ్ రిబ్బన్ క్లబ్ ఆధ్వర్యాన పాట్నాలో నిర్వహించిన రీజినల్ స్థాయి క్విజ్ పోటీలో ప్రథమ స్థానం సాధించిన దేవీశ్రీ ప్రసన్నను సన్మానించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థుల చదువు, హాజరుపై సూచనలు చేశారు. ప్రిన్సిపాల్ గోవిందరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, ఖమ్మం నయాబజార్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన పేరెంట్స్ – టీచర్స్ సమావేశంలో డీఐఈఓ రవిబాబు మాట్లాడారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మౌలిక వసతులు కల్పించడంతో పాటు విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నందున సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి, అధ్యాపకులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల సిబ్బందికి శిక్షణ
ఖమ్మం సహకారనగర్: స్థానిక సంస్థల ఎన్నిక ల నిర్వహణకు త్వరలో షెడ్యూల్ విడుదలవుతుందనే సమాచారంతో అధికార యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ మేరకు శుక్రవారం ఖమ్మం టీటీడీసీ సమావేశ మందిరంలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ దీక్షారైనా హాజరై సూచనలు చేశారు. అలాగే, భక్తరామదాసు కళాక్షేత్రంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు ఎంపిక చేసిన ఆర్‌ఓ, ఏఆర్‌ఓలకు శిక్షణ ఇవ్వగా జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మం మార్కెట్‌కు
సెలవులు
ఖమ్మంవ్యవసాయం: వారాంతంతో పాటు సద్దుల బతుకమ్మ, దుర్గాష్టమి, దసరా, గాంధీ జయంతి సందర్భంగా ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు ప్రకటించారు. ఈనెల 27, 28వ తేదీల్లో శని, ఆదివారాలు వారాంతపు సెలవులు వచ్చాయి. ఆతర్వాత 29వ తేదీన సోమవారం మార్కెట్ నిర్వహణ కొనసాగుతుంది. ఇక 30వ తేదీ మంగళవారం దుర్గాష్టమి, అక్టోబర్ 1న బుధవారం మహార్నవమి, 2వ తేదీ గురువారం విజయ దశమి, గాంధీజయంతి సందర్భంగా సెలవులు ప్రకటించారు. ఈ విషయాన్ని రైతులు, వ్యాపారులు గుర్తించాలని మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్ సూచించారు.

మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు

మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు