
122 కాదు.. 116 వైన్స్‌షాపులే..
● గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన అధికారులు ● మిగిలిన షాప్‌లు హైదరాబాద్‌కు కేటాయింపు
ఖమ్మంక్రైం: నూతన ఎకై ్సజ్ పాలసీలో భాగంగా జిల్లాలోని 122 మద్యం దుకాణాలకు బదులు 116 వైన్స్‌కే దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఈమేరకు గెజిట్ నోటిఫికేషన్‌ను జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారులు శుక్రవారం విడుదల చేశారు. ఇందులో భాగంగా వ్యాపారుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎకై ్సజ్ అధికారి నాగేందర్‌రెడ్డి తెలిపారు. ఖమ్మంలోని పోలీస్ ఏసీపీ కార్యాలయం పక్కనే ఉన్న ఎకై ్సజ్ స్టేషన్–1లో అన్ని ఎకై ్సజ్ సర్కిళ్లకు స్టేషన్లకు సంబంధించిన దరఖాస్తులు తీసుకునేందుకు కౌంటర్లు సిద్ధం చేశామని వెల్లడించారు. అక్టోబర్ 18వ తేదీ సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు.
ఆరు షాపుల రద్దు
గత ఎకై ్సజ్ పాలసీలో 122 మద్యం దుకాణాలకు దరఖాస్తులు స్వీకరించారు. అయితే, ఈసారి 116 వైన్స్‌కే గెజిట్ విడుదలైంది. మధిర ఎకై ్సజ్ సర్కిల్ పరిధిలోని ఆరు షాపుల్లో సరైన అమ్మకాలు లేనందున టెండర్లు తగ్గుతాయని భావించినట్లు సమాచారం. దీంతో ఆరు షాపులను హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి మార్చినట్లు తెలిసింది. అలాగే, గతంలో జిల్లా కేంద్రంలో ఆరు క్లస్టర్లు ఉండగా వాటిని ఈసారి మూడింటికి కుదించినట్లు సమాచారం. కాగా, జిల్లాలోని 116వైన్స్‌ల్లో 18 గౌడ కులస్తులకు, 14 ఎస్సీలకు, ఎనిమిది ఎస్టీలకు రిజర్వ్ చేశారు.