
కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు
ఖమ్మంవ్యవసాయం: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలను శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. మార్కెటింగ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మహిళా ఉద్యోగులు బతుకమ్మలను పేర్చి పూజలు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టూ ఆడిపాడారు. సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి, ఖమ్మం మార్కెట్ చైర్మన్ యరగర్ల హనుమంతరావు, జిల్లా మార్కెటింగ్ అధికారి ఎంఏ.అలీం, మద్దులపల్లి, వైరా మార్కెట్ల కార్యదర్శులు ఆంజనేయులు, మొహసీన్ సుల్తానా, ఉద్యోగులు పాల్గొన్నారు.
●ఖమ్మం సహకారనగర్: జిల్లా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో జెడ్పీ సీఈఓ దీక్షారైనా పాల్గొన్నారు. తొలుత ఉద్యోగులతో కలిసి పూజలు చేశాక ఆమె బతుకమ్మ పాటలు పాడుతూ నృత్యం చేశారు. జెడ్పీ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో బతుకమ్మ వేడుకలు