
ఈసారి దక్కించుకోవాల్సిందే..!
మూడే దరఖాస్తులు
● మద్యం షాపుల టెండర్లకు నోటిఫికేషన్ జారీ ● నేటి నుంచి దరఖాస్తుల స్వీకరణ ● అక్టోబర్ 18 వరకు గడువు, 23న డ్రా
ఖమ్మంక్రైం: జిల్లాలో మద్యం దుకాణాల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ కోసం ప్రభుత్వం గురువారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 122 వైన్స్‌కు శుక్రవారం నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలుకానుంది. ప్రస్తుతం కొనసాగుతున్న షాప్‌ల లైసెన్స్ కాలపరిమితి నవంబర్ 30న ముగియనుండగా.. ఆలోగా దరఖాస్తుల స్వీకరణ, డ్రా పూర్తి చేస్తే కొత్తగా షాప్‌లు దక్కించుకున్న వారు డిసెంబర్ 1వ తేదీ నుంచి మద్యం దుకాణాలు ప్రారంభించనున్నారు. నోటిఫికేషన్ వెలువడగానే ఇప్పటికే వ్యాపారంలో ఉన్న వారే కాక కొత్త వ్యక్తులు సైతం టెండర్ల దాఖలుకు ఏర్పాట్లు మొదలుపెట్టినట్లు సమాచారం. పాత వారితో గతంలో షాప్‌లు దక్కని వారు ఈసారి ఎలాగైనా వైన్స్ దక్కించుకోవాలనే భావనతో జట్టుగా మారుతున్నట్లు తెలిసింది.
ఎక్కడికక్కడే దరఖాస్తుల స్వీకరణ
మద్యం షాప్‌ల ఏర్పాటుకు దరఖాస్తుల స్వీకరణ ఈనెల 26వ తేదీన మొదలై అక్టోబర్ 18న ముగియనుంది. అదేనెల 23వ తేదీన డ్రా ద్వారా షాప్‌లను ఖరారు చేస్తారు. ఖమ్మం–1, 2, మధిర, సత్తుపల్లి, వైరా, సింగరేణి, నేలకొండపల్లి ఎకై ్సజ్ సర్కిల్ స్టేషన్లలో ఆయా పరిధిలోని వైన్స్ టెండర్లు స్వీకరిస్తారు. ఈమేరకు గురువారం నోటిఫికేషన్ రావడంతో ఎకై ్సజ్ సూపరిండెంట్ నాగేందర్‌రెడ్డి అధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సూచనలు చేశారు.
లైసెన్స్ ఫీజు రూ.3లక్షలు
మద్యం దుకాణాల ఏర్పాటుకు లైసెన్స్ ఫీజును రూ.3లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. గత ఎకై ్సజ్ పాలసీలో రూ.2లక్షలు ఉండగా రూ.లక్షల పెంచారు. దీంతో దరఖాస్తుల రూపంలోనే ఎకై ్సజ్ శాఖకు భారీగా ఆదాయం లభించనుంది. గత పాలసీలో 122 మద్యం దుకాణాలకు 7,207 దరఖాస్తులు అందగా, రూ.144.14 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఖమ్మం జిల్లాలోనే అత్యధిక దరఖాస్తులు అందాయి. దీంతో ఈసారి మరింత ఆదాయం రాబట్టుకోవాలనే భావనతో ఎకై ్సజ్ అధికారులు ఉన్నారు.
దరఖాస్తులు తగ్గుతాయా?
ఈ ఎకై ్సజ్ పాలసీలో దరఖాస్తుల సంఖ్య తగ్గే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గత పాలసీ సమయాన ఏపీ వ్యాపారులు పలువురు జిల్లాలో వైన్స్ దక్కించుకోవడానికి పోటీ పడ్డారు. కానీ అక్కడ కూడా ఎకై ్సజ్ పాలసీలో మార్పులు జరగడంతో జిల్లాలో వైన్స్ నిర్వహిస్తున్న ఏపీ వ్యాపారులు కొందరు ఈసారి టెండర్లు దాఖలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదని తెలిసింది. ఈ నేపథ్యాన బడా వ్యాపారులను కలిసి టెండర్లు దాఖలుకు ముందుకొచ్చేలా ప్రయత్నం చేయాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం.
రిజర్వేషన్లు అవే...
వైన్స్ కేటాయింపులో గౌడ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు అమలుచేశారు. రిజర్వేషన్ల ఆధారంగా కొన్ని షాపులను ఎంపిక చేసి వారికే టెండర్ల ద్వారా కట్టబెట్టారు. ఈసారి కూడా అవే రిజర్వేషన్ల కొనసాగే అవకాశముందని అధికారులు తెలిపారు. అయితే, రిజర్వేషన్ కేటగిరీలో కొన్ని సర్కిళ్లలో పెరిగి.. ఇంకొన్ని సర్కిళ్లలో తగ్గే అవకాశముందని సమాచారం. ఈ విషయమై స్పష్టత రావాల్సి ఉంది.
ఖమ్మంక్రైం: ఎకై ్సజ్ అధికారులు మైక్రో బేవరేజెస్ ఏర్పాటుకు దరఖాస్తులు ఆహ్వానించగా గడువు గురువారంతో ముగిసింది. హైదరాబాద్ తర్వాత అన్ని కార్పొరేషన్లలో మైక్రో బేవరేజెస్ ఏర్పాటుకు రూ.లక్ష దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. అయితే, గడువు ముగిసే సమయానికి ఉమ్మడి జిల్లాలో మూడు దరఖాస్తులే అందాయి. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో రెండు, కొత్తగూడెం జిల్లాలో ఒక దరఖాస్తు అందిందని అధికారులు తెలిపారు. అయితే, మైక్రో బేవరేజెస్‌పై ఎకై ్సజ్ అధికారులు అవగాహన కల్పించకపోవడం, ఇప్పటికే ఉన్న బార్లు సరిగ్గా నడవకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీనికి తోడు ఎక్కువ మంది వ్యాపారులు నూతన ఎకై ్సజ్ పాలసీ ప్రకారం వైన్స్ దక్కించుకోవడంపై దృష్టి సారించడంతో మైక్రో బ్రేవరేజెస్‌పై దృష్టి సారించలేదని సమాచారం.

ఈసారి దక్కించుకోవాల్సిందే..!