అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి.. | - | Sakshi
Sakshi News home page

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..

Sep 26 2025 6:40 AM | Updated on Sep 26 2025 6:40 AM

అడ్డం

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తూ.. ఏఎంవీఐ నుంచి ఆర్‌టీఓగా... సివిల్స్‌కు సిద్ధమవుతూనే.. జనరల్‌ కేటగిరీలో డీఎస్పీగా.. సివిల్స్‌ సాధిస్తా..

నియామక పత్రాలు అందుకోనున్న గ్రూప్‌– 1 విజేతలు

జాబితాలో నిరుపేదల బిడ్డలు పలువురు ...

ఇతర ఉద్యోగాలు చేస్తూనే ఎంపికై న కొందరు

పరీక్షలు, ఆ తర్వాత ఫలితాలు, ఇంటర్వ్యూలు పూర్తికావడానికి అనేక అడ్డంకులు.. అంతా పూర్తయ్యాక కేసులు.. ఇలా గ్రూప్‌–1లో ర్యాంకులు సాధించి ఉద్యోగాలకు ఎంపికై న వారికి నియామక పత్రాల పంపిణీ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు సమస్యలన్నీ పరిష్కారం కావడంతో అభ్యర్థులకు ప్రభుత్వం నియామక పత్రాలు అందజేయనుంది. దీంతో గ్రూప్‌–1 ఉద్యోగం దక్కించుకుని ఏళ్ల కల నెరవేర్చుకున్న వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో పలువురు కూలీల బిడ్డలు, నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వారు ఉండగా.. ఇంకొందరు ఉద్యోగాలు చేస్తూనే గ్రూప్‌–1కు ఎంపికయ్యారు. అయితే, ఇందులో చాలా మంది సివిల్స్‌ సాధించడమే తమ లక్ష్యమని చెప్పడం వారి తపనను చాటింది.

సత్తుపల్లిరూరల్‌: సత్తుపల్లి మండలం సత్యనారాయణపురానికి చెందిన పూరేటి అజయ్‌ గ్రూప్‌–1 ఫలితాల్లో ప్రతిభ చాటి ఎంపీడీఓగా ఎంపికయ్యారు. ఆయన తండ్రి శ్యామ్యూల్‌ తుంబూరు పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడుగా పని చేస్తుండగా, తల్లి ఝాన్సీ, సోదరి అలేఖ్య ఉన్నారు. ఐఐటీ భువనేశ్వర్‌లో బీటెక్‌ చేసిన అజయ్‌ నోయిడాలో సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌గా పనిచేయగా.. ఐఏఎస్‌ కావాలనే లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు.

ఖమ్మంక్రైం: గ్రూప్‌–1 ఫలితాల్లో ఖమ్మం ఏఎంవీఐ(అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌) వెల్ది గోపికృష్ణ ఆర్‌టీఓ(రవాణా ట్రాన్స్‌ఫోర్ట్‌ అధికారి)గా ఎంపికయ్యాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాకు చెందిన రైతు కుటుంబం నాగేశ్వరరావు – విజయలక్ష్మి పెద్దకుమారుడైన గోపికృష్ణ ఇంజనీరింగ్‌ పూర్తిచేశాక పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలు రాసి పది ఉద్యోగాలు సాధించాడు. ఇందులో ఏడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి. గ్రూప్‌–1 సిద్ధమవుతున్న సమయాన గోపికృష్ణ తండ్రి మృతి చెందగా.. తల్లి విజయలక్ష్మి, సోదరుడు గణేష్‌ ప్రోత్సాహంతో ముందుకు సాగిన ఆయన విజయం సాధించాడు. గోపీకృష్ణను డీటీఓ వెంకటరమణ, ఎంవీఐలు వరప్రసాద్‌, శ్రీనివాస్‌, ఏఎంవీఐ స్వర్ణలత, ఏఓ సుధాకర్‌ అభినందించారు.

తల్లాడ: తల్లాడకు చెందిన చింతా రాజు – చంద్రకళ కుమారుడు రాహుల్‌ 2019లో సివిల్స్‌ లక్ష్యంగా ఢిల్లీలో శిక్షణ తీసుకున్నారు. గత ఆరేళ్లుగా కష్టపడుతున్న ఆయన జనరల్‌లో 232, మల్టీ జోన్‌లో 115, ఎస్సీ కేటగిరీలో 8వ ర్యాంక్‌ సాధించి గ్రూప్‌–1 సాధించి డీఎస్పీగా ఎంపికయ్యాడు. బీటెక్‌ పూర్తిచేసిన రాహుల్‌ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా, తల్లి గృహిణి.

రఘునాథపాలెం: మండలంలోని బూడిదంపాడుకు చెందిన తుమ్మలపల్లి సంజయ్‌ గ్రూప్‌–1 లో జనరల్‌ కేటగిరీలో 469 మార్కులతో డీఎస్పీగా ఎంపికయ్యా డు. ఆయన తల్లి దండ్రులు నర్సింహారావు– ఉమ గ్రామంలో హోటల్‌ నిర్వహిస్తున్నారు. చిన్నతనం నుంచే కష్టపడి చదివిన సంజయ్‌ డిగ్రీ పూర్తయ్యాక గ్రూప్స్‌ కోసం శిక్షణ తీసుకున్నాడు.

కామేపల్లి: మండలంలోని గోవింద్రాలకు చెందిన గంగారపు సత్యనారాయణ–జ్యోతిర్మయి దంపతుల చిన్నకుమారుడు రత్నేశ్వరనాయుడు గ్రూప్‌–1 ఫలితాల్లో అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్‌(ఏటీఓ)గా ఎంపికయ్యాడు. ప్రసుత్తం ఆయన ఖమ్మంలోని కమర్షియల్‌ టాక్స్‌ డిపార్ట్‌మెంట్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే విజయం సాధించిన తాను సివిల్స్‌ సాధించే వరకు పట్టువిడవనని వెల్లడించాడు.

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..1
1/5

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..2
2/5

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..3
3/5

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..4
4/5

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..5
5/5

అడ్డంకులు అధిగమించి కొలువుల్లోకి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement