
54 అడుగుల భారీ బతుకమ్మ
కూసుమంచి: మండలంలోని పెరికసింగారంలో ఏటా బతుకమ్మ పండుగను స్థానికులు ఘనంగా జరుపుకుంటూ భారీ బతుకమ్మలు పేర్చడంలో పోటీ పడతారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన వేడుకలకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరుకాగా.. మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు కుటుంబసభ్యులు 54 అడుగుల భారీ బతుకమ్మ పేర్చి ప్రథమ స్థానంలో నిలిచారు. ఇందుకోసం ఆరు క్వింటాళ్ల బంతి, తంగేడు, టేకు పూలను వినియోగించారు. ఈ సందర్భంగా గోపాల్‌రావు కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అభినందించడమేకాక కాసేపు మహిళలతో కలిసి కోలాటం ఆడారు.
నేటి నుంచి
అసెస్‌మెంట్ పరీక్షలు
ఖమ్మం సహకారనగర్: సర్వే అండ్ ల్యాండ్ రికార్‌ుడ్స విభాగంలో సర్వేయర్లుగా అప్రెంటిస్ శిక్షణ పొందిన వారికి అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహించనున్నారు. అప్రెంటిస్ పూర్తయినందున ఈనెల 26, 27, 29వ తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు జిల్లాలో 305మంది పరీక్ష రాయనున్నారని వెల్లడించారు.