
వీర వనిత చాకలి ఐలమ్మ..
ఖమ్మంమయూరిసెంటర్: వీర వనిత చాకలి ఐలమ్మ ప్రదర్శించిన పోరాట స్ఫూర్తి మార్గదర్శకంగా నిలుస్తుందని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. చాకలి ఐలమ్మ జయంతిని శుక్రవారం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి ఎదురుగా ఆమె విగ్రహం వద్ద జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యాన నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి కలెక్టర్ అనుదీప్ పూలమాలలు వేసి నివాళులర్పించాక మాట్లాడారు. సమాజంలోని అసమానత్వం, దొరల దాష్టీకానికి ఎదురొడ్డి నిర్భయంగా పోరాడిన వీరనారి చాకలి ఐలమ్మ అని, జమీందార్ల పాలనలో వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాడేలా ప్రజల్లో స్ఫూర్తి నింపారని తెలిపారు. జిల్లా వెనకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జి.జ్యోతి, కార్పొరేటర్ బీ.జీ.క్లెమెంట్, రజక, బీసీ సంఘాల నాయకులు బొడ్డు ఉపేందర్, జక్కుల వెంకటరమణ, కనతాల నరసింహారావు, తుపాకుల ఎలగొండ స్వామి, గజ్జల వెంకన్న, పడిగల కృష్ణవేణి, కృష్ణారావు, రేగళ్ల సీతారాములు, సత్తెనపల్లి శ్రీను పాల్గొన్నారు.
జయంతి వేడుకల్లో కలెక్టర్ అనుదీప్