
ఖుషీల్.. డిప్యూటీ కలెక్టర్
తిరుమలాయపాలెం: గ్రూప్–1 ఫలితాలలో మండలంలోని కాకరవాయికి చెందిన కొత్తపల్లి శివకుమార్ – రేణుక కుమారుడు ఖుషీల్‌వంశీ డిప్యూటీ కలెక్టర్‌గా ఎంపికయ్యాడు. జనరల్ కేటగిరీలో రాష్ట్రస్థాయి 63, రిజర్వేషన్ కేటగిరీలో 3వ ర్యాంకు సాధించిన ఆయన గతంలో ఎస్సై ఉద్యోగంతో పాటు యూపీఎస్సీ ద్వారా ఇన్‌కం ట్యాక్స్ అసిస్టెంట్, సెంట్రల్ పోలీస్ అసిస్టెంట్ కమాండో, మిలిటరీ ఆఫీసర్ ఉద్యోగాలు సాధించాడు. ఖుషీల్ తండ్రి శివకుమార్ మాస్‌లైన్ సూర్యాపేట జిల్లా కార్యదర్శిగా, తల్లి రేణుక పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలపై పోరాడుతూ తల్లిదండ్రులను చూస్తూ పెరిగిన ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా ప్రజలకు తన వంతు చేయూతనిస్తానని చెబుతున్నాడు.