
అమ్మ కష్టంతో డిప్యూటీ కలెక్టర్ హోదా..
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఖానాపురానికి చెందిన ఎం.మురళి గ్రూప్–1లో సత్తా చాటి డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం సాధించాడు. రాష్ట్ర స్థాయిలో 83, జోనల్ స్థాయిలో 47వ ర్యాంకు సాధించిన ఆయన తన తండ్రి లక్ష్మీనారాయణ కన్నుమూయగా తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తూ చదివించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేకున్నా చదువుతూనే ఉద్యోగ ప్రయత్నాలు ప్రారంభించి 2018లో టీజీఎస్‌పీ స్పెషల్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించాడు. 2020లో సివిల్ కానిస్టేబుల్‌గా, 2024లో టీజీపీఎస్‌సీ ద్వారా జూనియర్ అకౌంటెంట్‌గా ఉద్యోగం సాధించిన మురళి ప్రస్తుతం ఖమ్మం నగర పాలక సంస్థలో జూనియర్ అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇప్పుడు గ్రూప్–1 ఉద్యోగం సాధించడానికి తన అమ్మ కష్టమే కారణమని మురళి వెల్లడించాడు. ఆయనను కేఎంసీ అకౌంట్స్ విభాగం ఉద్యోగులు అభినందించారు.