
విలీన గ్రామాలలో మౌలిక వసతులు
ఖమ్మం అర్బన్: ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌లో విలీనమైన అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్ప నకు కృషి చేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం 6వ డివిజన్‌లో రూ.1.46 కోట్ల నిధులతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రెయినేజీ పనులకు మంత్రి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ విలీనమైన గ్రామాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణంపై దృష్టి సారించామని తెలిపారు. ప్రతీ ఇంట్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవడమేకాక ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలని సూచించారు. అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి మాట్లాడగా మేయర్ పునుకొల్లు నీరజ, మార్కెట్ చైర్మన్ ఎర్రగర్ల హన్మంతరావు, కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావు, ఆర్‌అండ్‌బీ ఎస్‌ఈ యాకోబు, మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, తహసీల్దార్ సైదులు, కార్పొరేటర్ మలీదు వెంకటేశ్వర్లు, లకావత్ సైదులుతో పాటు ఏలూరు శ్రీనివాసరావు, గొడ్డేటి మాధవరావు, ఎల్లంపల్లి హన్మంతరావు, సరళ తదితరులు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు