
అమెరికాలో కేయూ స్వర్ణోత్సవాలు
తల్లాడ: కాకతీయ విశ్వవిద్యాలయం ప్రస్థానం 50ఏళ్ల మైలురాయి చేరుకున్న సందర్భంగా అమెరికాలో ప్రవాస భారతీయులు ఘనంగా స్వర్ణోత్సవాలు జరుపుకున్నారు. రెండు రోజుల పాటు మిత్రులు, గురువులతో కలిసి అనుభవా లను నెమరువేసుకున్నారు. కేయూలోని ఫార్మా స్యూటికల్ సైన్సెస్‌లో 1976 – 2025 వరకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులను పూర్తిచేసి అమెరికాలో వివిధ రంగా ల్లో స్ధిరపడిన 335 మంది అట్లాంటిక్ సిటీలోని క్యాసినోలో గల బోగట్ట హోటల్లో వేడుకలను సోమ, మంగళవారాల్లో జరుపుకున్నారు. తల్లా డ మండలం కుర్నవల్లికి చెందిన యన్నం శ్రీని వాసరెడ్డితో పాటు డాక్టర్ సాంబారెడ్డి, పరు చూరి శ్రీనివాస్, తమర విజయ్ కార్యక్రమాల ను పర్యవేక్షించారు. కేయూ ఉపకులపతి దర్శ న ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ రామచంద్రం, పారుపల్లి నేహా హాజరయ్యారు.
ఉద్యోగం సాధించిన ట్రాన్స్‌జెండర్
వైరారూరల్: మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన ట్రాన్స్‌జెండర్ కోరే రుచిత అలియాస్ రమేశ్ హైదరాబాద్‌లోని మెట్రో రైలులో సెక్యూరిటీ గార్డ్‌గా ఎంపికై మంత్రి అట్లూరి లక్ష్మణ్ చేతుల మీదుగా మంగళవారం నియామక పత్రం అందుకున్నారు. రుచిత 2019 వరకు పురుషుడిగా ఉండి డీగ్రీ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత వరంగల్ వెళ్లి అక్కడ ట్రాన్స్‌జెండర్లతో కలిసి భిక్షాటన చేసిన రుచిత 2021లో హైదరాబాద్‌లో లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకొని ట్రాన్స్‌జెండర్‌గా మారాడు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్లు ఆత్మగౌరవంగా జీవించేందుకు మెట్రో రైల్ శాఖలో సెక్యూరిటీ గార్డ్ పోస్టుల దరఖాస్తులకు ఆహ్వానించగా రుచిత దరఖాస్తు చేసుకొని ఉద్యోగాన్ని సాధించింది.
మట్టి తోలకాల
స్థావరాలపై దాడి
బోనకల్: మండలంలోని లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో మట్టి తోలకాల స్థావరాలపై బుధవా రం మధిర సీఐ మధు, ఎస్‌ఐ పొదిలి వెంకన్న, ఆర్‌ఐ షేక్ వహిదాసుల్తానా దాడులు నిర్వహించారు. కొంతకాలంగా లక్ష్మీపురం రెవెన్యూ పరిధిలో అనుమతులు లేకుండా కొందరు అక్రమమార్గంలో వందల ట్రిప్పర్ల మట్టిని తరలిస్తున్నారు. దీంతో పోలీస్, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి, అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్, టిప్పర్లను సీజ్ చేసినట్లు సీఐ మధు తెలిపారు.
చుక్కల దుప్పి మృతి
సత్తుపల్లి: వీధి కుక్కలు వెంట పడటంతో ఓ చుక్కల దుప్పి మృతి చెందిన ఘటన సత్తుపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. సింగరేణి అటవీ ప్రాంతం వైపునుంచి పట్టణంలోని జలగంనగర్‌కు వచ్చిన దుప్పి.. వీధి కుక్కలు వెంట పడటంతో మృతిచెందింది. స్థానికులు అటవీశా ఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో మృతి చెందిన చుక్కల దుప్పిని స్వాధీనం చేసుకున్నా రు. దుప్పి ఎలా చనిపోయిందో నిర్ధారించడం కోసం వెటర్నరీ వైద్యులతో పోస్టుమార్టం చేయించాల్సి ఉందని రేంజర్ స్నేహలత తెలిపారు.

అమెరికాలో కేయూ స్వర్ణోత్సవాలు