ఖమ్మం రాపర్తినగర్ : దక్షిణ మధ్య రైల్వే శాఖ మరో అమృత్ భారత్ రైలును ఖమ్మం మీదుగా నడపనుంది. ఈ రైలు వారంలో ఒకరోజు మాత్రమే ఉంటుందని అధికారులు తెలిపారు. ఈరోడ్ నుంచి జోగ్‌బని వెళ్లే రైలు(16601) ఈనెల 25న గురువారం రాత్రి 23:09 ని.లకు ఖమ్మం స్టేషన్‌కు వచ్చి 23:10 ని.లకు బయలు దేరుతుందని, జోగ్‌బని–ఈరోడ్ రైలు (16602) మధ్యాహ్నం 12.24 ని.లకు వచ్చి 12:25ని.లకు బయలుదేరుతుందని తెలిపారు. ఇందులో స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయని పేర్కొన్నారు.
సకాలంలో టీకాలు వేయాలి
జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ రమణ
కల్లూరు/కల్లూరురూరల్ : గర్భిణులు, చిన్నారులకు సకాలంలో టీకాలు వేసి వారి ఆరోగ్య పరి రక్షణకు కృషి చేయాలని జిల్లా వ్యాక్సిన్ మేనేజర్ సీహెచ్.వి.రమణ అన్నారు. కల్లూరు మండల కేంద్రంతో పాటు బత్తులపల్లి, చెన్నూరు ప్రభుత్వాస్పత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న టీకా కార్యక్రమాలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇంకా టీకాలు వేయని వారుంటే బుధవారం నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే స్వస్థ్ నారీ–సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో గుర్తించి అందరికీ వేయాలని, యూడబ్ల్యూఐఎన్ పోర్టర్‌లో నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. చిన్నారులు, మహిళల ఆరోగ్య భద్రతకు ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. టీకాల కార్యక్రమంపై ప్రభుత్వ వైద్యులు డాక్టర్ నవ్యకాంత్ తదితరులతో చర్చించారు. కార్యక్రమంలో సీహెచ్‌ఓ రాణి, అధికారులు, సిబ్బంది వేణుగోపాల్, సత్యనారాయణ, నవీన్, కిరణ్, గుండెపునేని రామారావు పాల్గొన్నారు.
311 మంది
ఉపాధ్యాయుల సర్దుబాటు
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో ఖాళీగా ఉన్న వివిధ సబ్జెక్టుల ఉపాధ్యాయులను సర్దుబాటు (వర్క్ అడ్జస్ట్‌మెంట్) చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారిగా ఉన్న అదనపు కలెక్టర్ పి.శ్రీజ బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో 311 మంది ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను పారదర్శకంగా చేపట్టినట్లుగా అధికారులు తెలిపా రు. స్థానిక మండలాల్లో ప్రాధాన్యత ఇచ్చి అవసరమైన మేరకు సర్దుబాటు చేయగా మిగిలిన వారిని ఇతర ప్రాంతాలకు పంపించారు. కాగా, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గతంలో చేసి న డిప్యుటేషన్లను రద్దుచేసినట్లు తెలిపారు.