
నిరుపేద విద్యార్థులకు చేయూత
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ప్రతిభావంతులైన నిరుపేద విద్యార్థుల ఉన్నత చదువుతకు చేయూతనిస్తున్న పరిశ సీతారత్నం చారిటబుల్ ట్రస్ట్ సేవలు అభినందనీయమని కూసుమంచి జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వీరభద్రరావు, విశ్రాంత ఏడీ పి.కోటేశ్వరరావు కొనియాడారు. వైరాకు చెందిన బసవోజు మనోజ్, ఖమ్మం వైఎస్సార్ కాలనీకి చెందిన తాటికొండ సోమశేఖర్‌కు ట్రస్ట్ తరఫున రూ.20వేల చొప్పున చెక్కులను శనివారం ఖమ్మంలో అందజేశారు. ట్రస్ట్ చైర్మన్ పరిశ పుల్లయ్య, మహంకాళి స్వరాజ్యలక్ష్మి, పరిశ లక్ష్మీరాజ్యం, శ్రీనివాసరావు, ఊడుగు వెంకటేశ్వరరావు, సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.
రైతుల ఆవేదనను
గుర్తించండి
పెనుబల్లి: గ్రీన్ ఫీల్డ్ హైవేపై సర్వీస్ రోడ్డు లేకపోతే రైతులు ఇబ్బంది పడనున్నందున వారి ఆవేదనను అధికారులు గుర్తించాలని కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్ పేర్కొ న్నారు. పెనుబల్లి, వేంసూరు మండలాల రైతులు హైవే వెంట చిన్న బ్రిడ్జిలకు బదులు సర్వీస్ రోడ్డు నిర్మించాలనే డిమాండ్‌తో రెండో రోజైన శనివారం కూడా నిరసన తెలిపారు. ఈమేరకు కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్‌కు దయానంద్ సమాచారం ఇవ్వగా ఆయన చేరుకుని వివరాలు ఆరాతీశారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ సర్వీస్ రోడ్లు లేకపోతే రైతులు పొలాలకు వెళ్లాలంటే 10కి.మీ. చుట్టూ తిరగాల్సి వస్తుందని తెలిపారు. ఈ విషయమై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. భూనిర్వాసిత రైతులు, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు, నాయకులు కీసర వెంకటేశ్వరరెడ్డి, చీకటి రామారావు, వి.పవన్, గూడూరు మాధవరెడ్డి, దొంతు మాధవరావు, ఈడా కమలాకర్, పిల్లి నవజీవన్ పాల్గొన్నారు.
మధిరలో కోదాడ ఎమ్మెల్యే
మధిర: రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సతీమ ణి, కోదాడ ఎమ్మెల్యే పద్మావతి శనివారం మధి ర వచ్చారు. ఈ సందర్భంగా ఆమెకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ నాయకులు వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డితో పాటు అనిల్‌కుమార్ నెహ్రూ, కరివేద సుధాకర్ తదితరులు స్వాగతం పలికారు. అనంతరం పద్మావతి డిప్యూటీ సీఎం సతీమణి నందినితో సమావేశమయ్యారు. అలాగే, ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు మోహిందర్ సింగ్ సైతం మల్లు నందినితో సమావేశం కాగా ఆయనను సన్మానించారు.
రోడ్డుప్రమాదంలో
వ్యక్తి మృతి
మోతె: టీవీఎస్ ఎక్సెల్‌పై వెళ్తున్న వ్యక్తిని వెనుక నుంచి మరో ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో మృతి చెందాడు. సూర్యాపేట–ఖమ్మం జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా మోతె మండలం మామిళ్లగూడెం శివార్లలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్లచెర్వుకు చెందిన గుండమాల వెంకన్న(50) టీవీఎస్ ఎక్సెల్‌పై మోతె వచ్చి తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా మామిళ్లగూడెం శివారులో వెనుక నుంచి ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన వెంకన్నను 108లో ఖమ్మం తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడని ఎస్‌ఐ అజయ్‌కుమార్ తెలిపారు.

నిరుపేద విద్యార్థులకు చేయూత

నిరుపేద విద్యార్థులకు చేయూత