
ఈనెల 16 నుంచి ‘యాత్రాదానం’
దూరం ఆధారంగా ప్యాకేజీల వారీ చార్జీల వివరాలు
● దాతలు కోరుకున్న రోజుల్లో బస్సుల ఏర్పాటు ● ఆర్టీసీ రీజియన్ మేనేజర్ సరిరాం
ఖమ్మంమయూరిసెంటర్: ప్రత్యేక రోజుల్లోఅనాథలు, నిరాశ్రయులైన వృద్ధులు, దివ్యాంగులు, నిరుపేద విద్యార్థులను పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు, విహారయాత్రలకు తీసుకెళ్లేలా టీజీఎస్‌ఆర్టీసీ ‘యాత్రాదానం’ పేరిట కార్యక్రమాన్ని రూపొందించిందని ఖమ్మం రీజియన్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. ఆసక్తి ఉన్న వారు తాము కోరుకున్న రోజుల్లో పర్యటనకు తీసుకెళ్లేలా విరాళం అందజేయొచ్చని తెలిపారు. విరాళం ఆధారంగా ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులు సమకూరుస్తామని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు వివరాల కోసం సమీప ఆర్టీసీ డిపోల్లో సంప్రదించాలని ఆర్‌ఎం సూచించారు.
దూరం ఎక్స్‌ప్రెస్ డీలక్స్ సూపర్‌లగ్జరీ రాజధాని
(కి.మీల్లో.) (రూ.ల్లో)
0–200 26,707 32,587 29,752 43,507
201–300 32,587 32,587 29,752 43,507
301–400 38,782 38,782 35,002 43,507
401–500 44,977 44,977 40,252 50,962