
ఊరూరా వరి !
మద్దతు ధరకు తోడు బోనస్‌తో అన్నదాతల ఆసక్తి అనుకూలించిన వానలతో ఉత్సాహం ఇప్పటికే 2.90 లక్షల ఎకరాల్లో పంట
సన్నరకాలకు ప్రాధాన్యత
సమృద్ధిగా నీరు ఉండడంతో...
సత్తుపల్లి సమీపాన సాగవుతున్న వరి పంట
సరిపడా వానలు
ఈ ఏడాది పంటల సాగుకు వర్షాలు అనుకూలించాయి. సీజన్‌లో జూన్ మినహా, జూలై, ఆగస్టు నెలల్లో సాధారణానికి మించి వర్షపాతం నమోదైంది. జూన్‌లో 131.2 మి.మీ. వర్షపాతానికి గాను 123.9గా నమోదైతే, జూలైలో 240.9 మి.మీ.కు 281.6, ఆగస్టులో 240మి.మీ.కు గాను 389.7గా నమోదు కావడంతో జలాశయాల్లోకి సమృద్ధిగా నీరు చేరింది.
వివిధ పద్ధతుల్లో సాగు
వర్షాలు సమృద్ధిగా కురవడంతో రైతులు వరి సాగుకు ప్రాధాన్యత ఇచ్చారు. కూలీల కొరత, ఇతర ఇబ్బంతుల నేపథ్యాన రకరకాల విధానాలు ఎంచుకున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పొడి దుక్కుల్లోనే వరి విత్తనాలు చల్లగా, కొందరు భూములను దమ్ము చేసి విత్తనాలను ఒకరోజు నానబెట్టి వెదజల్లే పద్ధతిలో సాగు చేశారు. ఇంకొందరు డ్రమ్ సీడర్ విధానం ద్వారా విత్తనాలు నాటారు. మరికొందరు సంప్రదాయ విధానంలో వరి నార్లు పోసి నాట్లు వేశారు.
సత్తుపల్లి డివిజన్‌లో అత్యధికం
జిల్లాలోని సత్తుపల్లి వ్యవసాయ డివిజన్‌లో అత్యధికంగా 1,28,434 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ డివిజన్‌లోని కల్లూరు మండలంలో 33,403ఎకరాల్లో పంట సాగు చేశారు. ఆ తర్వాత స్థానంలో పాలేరు(కూసుమంచి) వ్యవసాయ డివిజన్‌లో 72,259 ఎకరాల్లో సాగవుతోంది. అలాగే, మధిర వ్యవసాయ డివిజన్‌లో 41,356, వైరా డివిజన్‌లో 36,281, ఖమ్మం డివిజన్‌లో 12,530 ఎకరాల్లో రైతులు వరి సాగు చేస్తున్నారు.
జిల్లాలో లక్ష్యాన్ని దాటేలా పంట సాగు
అన్ని వ్యవసాయ డివిజన్లలో వరి లక్ష్యం మేర సాగవుతోంది. జూలై, ఆగస్టులో కురిసిన వాన సాగుకు అనుకూలించింది. వరిలో కూడా రైతులు సన్నరకాలకే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రభుత్వం బోనస్ ఇస్తుండటంతో ఈ రకాలే ఎంచుకున్నారు.
– ధనసరి పుల్లయ్య,
జిల్లా వ్యవసాయాధికారి
మంచి వర్షాలతో జలాశయాల్లోకి నీరు చేరడం వరి సాగుకు అనుకూలించింది. మొత్తం 20ఎకరాల్లో వెదజల్లే పద్ధతి, డ్రమ్‌సీడర్, నాట్ల విధానంలో సాగు చేస్తున్నాం. ప్రభుత్వం బోనస్ ఇస్తుండడంతో మొత్తం సన్నరకాలే ఎంచుకున్నాం.
– దేవరపల్లి సత్యనారాయణరెడ్డి, కమలాపురం, ముదిగొండ మండలం

ఊరూరా వరి !

ఊరూరా వరి !