
ఈనెల 10న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్: రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ఎన్.ప్రీతమ్ ఈనెల 10న జిల్లాలో పర్యటించనున్నారని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ కార్యాలయంలో గురువారం ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు బొడ్డు బొందయ్య అధ్యక్షతన నిర్వహించగా దుర్గాప్రసాద్ మాట్లాడారు. దళితులకు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం చేసిన ఏకై క పార్టీ కాంగ్రెస్ మాత్రమేనని తెలిపారు. ఈనెల 10న రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, దళిత కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.ప్రీతమ్ జిల్లా పర్యటన సందర్భంగా జరిగే దళిత సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అనంతరం ఎస్సీ సెల్ నాయకులు ఆయనను సత్కరించారు.
జల్లేపల్లి గణేష్ లడ్డూకు రికార్డు ధర
● రూ.90,116కు దక్కించుకున్న
పుసులూరి వేణు
తిరుమలాయపాలెం: మండలంలోని జల్లేపల్లిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ప్రతిష్ఠించిన వినాయకుడి చేతిలో లడ్డూకు రికార్డు ధర పలికింది. ఈమేరకు గురువారం పది కేజీల లడ్డూ వేలం నిర్వహించగా గ్రామానికి చెందిన పుసులూరి వేణు – అనూష దంపతులు రూ.90,116కు దక్కించకున్నారు. అలాగే, మరో చిన్న లడ్డూను రాచకొండ నగేష్ రూ.17,016కు పాడారు.

ఈనెల 10న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పర్యటన