
సరికొత్త ఆశలు..
జిల్లాలో 189 మంది
2003 డీఎస్సీ ఉపాధ్యాయులు
ఖమ్మం సహకారనగర్ : డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు ఓపీఎస్ వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో జిల్లాలోని 189 మందిలో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. కాగా, పాత పెన్షన్‌ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఎంప్లాయీస్ యూనియన్ (టీఎస్ సీపీఎస్‌ఈయూ), ఎన్‌ఎం ఓపీఎస్‌ల ఆధ్వర్యంలో పదేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దశల వారీగా ఉద్యమాలు చేశామని, దాని ఫలితంగానే 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరుతోందని సీపీఎస్ నాయకులు అంటున్నారు.