
పాలేరు పొలాల్లో రాజుకున్న అగ్గి
భారీగా చెలరేగుతున్న మంటలు
కూసుమంచి: మండలంలోని పాలేరు రిజర్వాయర్ కింద పొలాల్లో గుర్తుతెలియని వ్యక్తులు గురువారం వరి కొయ్యలకు నిప్పుపెట్టగా గాలికి మంటలు చెలరేగాయి. రిజర్వాయర్ కట్ట నుండి ఖమ్మం–సూర్యాపేట జాతీయ రహదారి వరకు సుమారు రెండు కి.మీ. మేర మంటలు వ్యాపించాయి. ఈ మంటల్లో పలువురు రైతుల గడ్డి వాములు, కరెంటు మోటార్లు, స్టార్టర్లు కాలిపోవడంతో భారీ నష్టం వాటిల్లింది.
చర్యలు తీసుకోండి..
ఖమ్మం నుండి హైదరాబాద్‌కు గురువారం రాత్రి ఈ మార్గంలో వెళ్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంటలను గమనించారు. వ్యవసాయశాఖ అధికారులకు ఫోన్ చేసిన ఆయన కొయ్యలకు నిప్పు పెట్టిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది.