
పంటల మార్పిడితోనే ఫలితం
ఏన్కూరు: రైతులు పంటల మార్పిడి పాటిస్తూ మార్కెట్‌లో అధికధరలు పలికే పంటలు సాగు చేయడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించాలని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.రవికుమార్ సూచించారు. ఏన్కూరు మండలం నాచారంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అవసరం మేరకే ఎరువులు వినియోగిస్తూ నేల ఆరోగ్యాన్ని కాపాడాలని తెలిపారు. వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ మాట్లాడుతూ వానాకాలంలో ఎంచుకోవాల్సిన పంటలు, విత్తనాల కొనుగోలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో వెటర్న టీ డాక్టర్ సుబ్బారావు, ఏఓ నరసింహారావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ అధికారి తేజ శ్రీ, ఏఈఓలు కమలాకర్, భాగ్యలహరి, నవ్య, భవ్య, మాజీ ఎంపీపీ వరలక్ష్మి, నల్లమల వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
పీహెచ్‌సీకి రూ.80వేల విలువైన ఇన్వర్టర్లు
ఎర్రుపాలెం: మండలంలోని బనిగండ్లపాడు పీహెచ్‌సీకి కాంగ్రెస్ నాయకుడు యరమల పూర్ణచంద్రారెడ్డి రూ.80వేల విలువైన ఇన్వర్టుర్లు, బ్యాటరీలు వితరణ చేశారు. ఆస్పత్రిలో సోమవారం ఆయన సామగ్రిని పీహెచ్‌సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రశాంత్‌కు అందచేశారు. అనంతరం డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, వైద్యాధికారి ప్రశాంత్ మాట్లాడుతూ పూర్ణచంద్రారెడ్డి అందించిన ఇన్వర్టర్లతో విద్యు త్ అంతరాయం ఏర్పడినప్పుడు సమస్యలు ఉండవని తెలిపారు. అనంతరం దాతను సత్కరించారు. వైద్యులు రంజిత్, కార్తీక్, లక్ష్మీలోహిత, అశ్విని, ఉద్యోగులు పాల్గొన్నారు.
పోరాటమే
సుందరయ్యకు నివాళి
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్రం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడడమే పుచ్చలపల్లి సుందరయ్యకు ఇచ్చే నివాళి అవుతుందని సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు తెలిపా రు. ఖమ్మంలోని సుందరయ్య భవనంలో సోమవారం ఆయన ఆయన 40వ వర్ధంతి నిర్వహించారు. ఈసందర్భంగా సుందరయ్య విగ్రహం వద్ద నివాళులర్పించాక నాగేశ్వరరావు మాట్లాడారు. భారత్ – పాకిస్తాన్ నడుమ కాల్పుల విరమణ ఒప్పందంలో అమెరికా జోక్యాన్ని నిరసిస్తున్నట్లు తెలిపారు. ఈ విషయంలో రెండు దేశాల కంటే ముందు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం ద్వారా ఆయనకు మోదీ దాసోహమైనట్లు తేలుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.సోమయ్య, పొన్నం వెంకటేశ్వరరావు, ఎం.సుబ్బారావు, మాచర్ల భారతి, కళ్యాణం వెంకటేశ్వరరావు, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి
రెండో విడత శిక్షణ
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని ఉపాధ్యాయులకు మంగళవారం నుంచి రెండో విడత శిక్షణ ప్రా రంభం కానుందని, ఎంపిక చేసిన వారంతా హాజరుకావాలని డీఈఓ సామినేని సత్యనారాయణ పేర్కొన్నారు. ఖమ్మంలోని హార్వెస్ట్ పాఠశాల, న్యూ ఇరా పాఠశాల, న్యూవిజన్ పాఠశాలల్లో ఐదు రోజుల శిక్షణ ఉంటుందని తెలిపారు. మండలాల వారీగా ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంలు, ఎస్‌జీటీలు సబ్జెక్ట్ పుస్తకాలు, కరదీపికలతో హాజరుకావాలని సూచించారు.
23న జిల్లాస్థాయి
అథ్లెటిక్స్ ఎంపికలు
ఖమ్మం స్పోర్ట్స్: జిల్లాస్థాయి సబ్ జూనియర్ అథ్లెటిక్స్ జట్ల ఎంపికకు ఈనెల 23న కల్లూరు మినీ స్టేడియంలో పోటీలు నిర్వహిస్తున్నట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఎం.డీ.షషీక్ అహ్మద్ తెలిపారు. అండర్–8, 10, 12 బాలబాలికల విభాగాల్లో పోటీలుజరుగుతాయని వెల్లడించారు. అండర్–8 బాలబాలికలకు 60, 200 మీ టర్లు, స్టాండింగ్ బ్రాడ్‌జంప్, పరుగుపందెం, అండర్–10 బాలబాలికలకు 60, 300 మీటర్లు, లాంగ్‌జంప్, అండర్–12 బాలబాలికలకు60, 600 మీటర్లు, షాట్‌ఫుట్, లాంగ్‌జంప్ అంశాల్లో ఎంపికలు ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు ఉద యం 8గంటలకల్లా స్టేడియం ఇన్‌చార్జ్ పి.వీర రాఘవయ్యకు రిపోర్ట్ చేయాలని సూచించారు.

పంటల మార్పిడితోనే ఫలితం

పంటల మార్పిడితోనే ఫలితం