
ఉపాధ్యాయుల బకాయిలు విడుదల చేయాలి
ఖమ్మం సహకారనగర్: సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉద్యోగ, ఉపాధ్యాయులకే కాక పదో తరగతి మూల్యాంకనలో పాల్గొన్న ఉపాధ్యాయుల రెమ్యూనరేషన్ బకాయిలు మంజూరు చేయాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపి కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగులు 2024 నవంబర్‌లో సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనగా ఇప్పటివరకు రెమ్యునరేషన్ ఇవ్వలేదన్నారు. ఈ–కుబేర్‌లో పెండింగ్ పెట్టారని తెలిపారు. అంతేకాక 2022లో పదో తరగతి స్పాట్ విధులు నిర్వర్తించిన ఆంగ్లం, గణితం ఉపాధ్యాయులకు బకాయిలు విడుదల చేయాల్సి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుర్రి వెంకన్న, వల్లంకొండరాంబాబు, నాగేశ్వరరావు, ఉద్దండు షరీఫ్,విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.