
ప్రతిభావంతులకు ప్రశంసా పత్రాలు
దమ్మపేట: పదోతరగతి ఫలితాల్లో ప్రతిభ కనబరి చిన దమ్మపేట మండలానికి చెందిన ఆశ్రమ పాఠశాల విద్యార్థులను రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రి ధనసరి సీతక్క, శాఖ కార్యదర్శి శరత్ అభినందించి, ప్రశంసా పత్రాలను అందజేశారు. బుధవారం హైదరాబాద్‌లోని కొమురం భీమ్ భవన్‌లో గిరి జన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో అకాడమిక్ సక్సెస్ మీట్(2024–25)ను ఘనంగా నిర్వహించారు. 575, 569 మార్కులతో గిరిజన ఆశ్రమ పాఠశాల పరిధిలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన అంకంపాలెం బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థులు వాడే మౌనిక, స్రవంతిలకు గోల్డ్ మెడళ్లను అందజేశారు. వందశాతం ఉత్తీర్ణత సాధించిన ఆశ్రమ పాఠశాలల హెచ్‌ఎంలను కూడా మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. ఏటీడీఓ చంద్రమోహన్, హెచ్‌ఎంలు శారద, చంద్రకళ, వార్డెన్ నాగమణి పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయిలో ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించిన అంకంపాలెం విద్యార్థినులు