
ఉత్పత్తుల విక్రయానికి వేదికగా మహిళా మార్ట్
ఖమ్మంమయూరిసెంటర్: మహిళా స్వయం సంఘాల్లోని సభ్యులు రూపొందించిన వస్తువులను అమ్ముకునేలా మహిళా మార్ట్ వేదిక కానుందని ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. పలు వురు సభ్యులు తయారు చేసిన ఉత్పత్తులను మంగళవారం కేఎంసీ కార్యాలయంలో మెప్మా అధికారుల సమక్షాన ప్రదర్శించారు. ఆయా సామగ్రిని పరిశీలించిన మేయర్ మాట్లాడుతున్న నాణ్యమైన ఉత్పత్తులను తయారుచేస్తున్న మహిళలకు మార్ట్ ప్రారంభంతో మెరుగైన ధర లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంసీ ఎస్.సుజాత, టీఎంసీ జి.సుజాత, సీఓలు పాల్గొన్నారు.
రేషన్ షాపుల్లో
ఆకస్మిక తనిఖీలు
కల్లూరురూరల్: కల్లూరు మండలంలోని 33రేషన్ షాపుల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు మంగళవారం మూడు బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రేషన్ దుకాణాల్లో పంపిణీ చేస్తున్న సన్న బియ్యంతో పాటు గతంలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం నిల్వలకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. ఈ మేరకు నివేదికలను జిల్లా అధికారులకు పంపించి నట్లు తెలిపారు. తనిఖీల్లో సివిల్ సప్లయీస్ డీటీలు సత్యనారాయణ, నాగలక్ష్మి, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్ పాల్గొన్నారు.
అండర్‌పాస్ వద్ద
రైతుల ధర్నా
వైరారూరల్: ఖమ్మం – దేవరపల్లి హైవేలో భాగంగా వైరా మండలం కేజీ సిరిపురం సమీపాన అండర్‌పాస్‌ను తక్కువ ఎత్తుతో నిర్మించడంపై రైతులు నిరసన తెలిపారు. ఎత్తు తక్కువగా ఉండడంతో ధాన్యం, గడ్డి ట్రాక్టర్లు, వరి కోత మిషన్ల రాకపోకలకు ఇబ్బంది ఎదురవుతుందని వాపోయారు. ఈమేరకు మంగళవారం పలువురు రైతులు అండర్‌పాస్ వద్ద ధర్నా చేశారు. వంతెన నిర్మాణ సమయంలోనే కాంట్రాక్టర్, మేనేజర్‌కు సమస్యను వివరించి నా ఫలితం కానరాలేదని పేర్కొన్నారు. కాగా, రైతుల ధర్నా సమాచారం అందుకున్న హైవే మేనేజర్ గుత్తి శివశంకర్ చేరుకుని ఈనెల 25వ తేదీ నాటికి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో అయినాల కనకరత్నం, నారపోగు వెంకటి, ఇనపనూరి జయరావు, పింగళి లక్ష్మ య్య, పైడిపల్లి శేషగిరి, నారపోగు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
క్రీడాకారులు
జాతీయ స్థాయికి ఎదగాలి
నేలకొండపల్లి: గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారులు సత్తా చాటుతూ జాతీయ స్థాయికి ఎదగాలని నేలకొండపల్లి మార్కెట్ చైర్మన్ వెన్నపూసల సీతారాములు ఆకాంక్షించారు. మండలంలోని మంగాపురంతండాలో ఇంటి ముత్యాలమ్మ తల్లి పండుగ సందర్భంగా ఏపీ–తెలంగాణలోని మూడు జిల్లాల స్థాయి క్రికెట్ పోటీలను మంగళవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. పోటీలతో యువతలో పోటీతత్వం, స్నేహసంబంధాలు పెంపొందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, జెర్రిపోతుల అంజిని, బచ్చలకూరి నాగరాజు, రాయపూడి నవీన్, హనుమంతరావు, నల్లాని మల్లికార్జున్‌రావు, ఎం.వెంకన్న, కడియాల నరేష్ తదితరులు పాల్గొన్నారు.
క్రిమినల్ కేసు కొట్టివేత
ఖమ్మంలీగల్: జిల్లాలోని చింతకానికి చెందిన సింగారపు కార్తీక్ ఆత్మహత్య ఘటనలో ఇసారం సిద్ధార్థ, వెల్లంకి సుప్రియపై నమోదైన అభియోగాన్ని కొట్టివేస్తూ ఖమ్మం మొదటి అదనపు అసిస్టెంట్ సెషన్స్ జడ్జి వి.శివరంజని మంగళవారం తీర్పు చెప్పారు. 2021 ఆగస్ట్ 20న కార్తీక్ ఆత్మహత్య చేసుకోగా, అందుకు సిద్ధార్థ, సుప్రియ కారణమని ఆయన తల్లి స్వరూపరాణి ఫిర్యాదు చేసింది. దీంతోఆత్మహత్య ప్రేరేపిత కేసు నమోదు చేసినపోలీసులు కోర్టులో అభియోగపత్రం దాఖలుచేశారు. సాక్ష్యాధారాలు, ఇరుపక్షాల వాదనలను పరిశీలించాక నిందితులపై అభియోగం రుజువు కాకపోవడంతో కేసు కొట్టివేస్తూ చిన న్యాయాధికారి తీర్పు చెప్పారు. కాగా, నిందితుల తరఫున న్యాయవాది కొండపల్లి శ్రీనివాస్‌చౌదరి వాదించారు.

ఉత్పత్తుల విక్రయానికి వేదికగా మహిళా మార్ట్

ఉత్పత్తుల విక్రయానికి వేదికగా మహిళా మార్ట్