మళ్లీ వర్షం వచ్చేనా? | - | Sakshi
Sakshi News home page

మళ్లీ వర్షం వచ్చేనా?

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

రౌద్రరూపం

శివాజీనగర: తరచూ మేఘావృతమై వర్షాలు కురుస్తూ చల్లదనంతో ఆహ్లాదం కలగాల్సిన సమయంలో ఎండ వేడిమి, చెమటలతో వాతావరణం చిరాకెత్తిస్తోంది. ఎల్‌నినో దాడి వల్ల రాష్ట్రంలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. సోమవారం వరకూ అంతటా పొడి వాతావరణం నమోదైంది. బెంగళూరుతో సహా ఎక్కడా వర్షంపడే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్‌ 15 నుంచి 21 మధ్య రుతుపవనాలు పూర్తిగా వెనక్కు వెళ్లిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. ఒకటీ రెండు చోట్ల జల్లులు కురిశాయి.

ఎక్కడ వాతావరణం ఎలా?

వచ్చే 24 గంటల్లో బెంగళూరు, పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో పొగమంచు ఆవరించవచ్చు. 20 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌ మధ్య ఉష్ణోగ్రతలు ఉంటాయి. తీరప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొంది. ఉత్తర కర్ణాటక జిల్లాల్లో అధిక ఎండలు భయపెట్టే అవకాశముంది. బెంగళూరు నగర, గ్రామీణ, పరిసర జిల్లాల్లోనూ పొడి పొడిగానే ఉంటుంది. భారత వాతావరణ శాఖ ప్రకారం రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతుంది. అక్టోబర్‌ 15న కొన్నిచోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశముంది.

రాష్ట్రమంతటా పొడి వాతావరణం

ఉత్తర కర్ణాటకకు ఎండల ముప్పు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement