బనశంకరి: కేపీఎస్‌సీ పశువైద్యాధికారుల కుంభకోణం కేసులో అరైస్టెన దళారీ బసవరాజ్ కన్నాళేకు హైకోర్టు 6 రోజుల మధ్యంతర బెయిల్‌ను మంజూరుచేసింది. సోమవారం కన్నాళే బెయిల్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ విశ్వజిత్‌శెట్టి విచారించారు. కన్నాళే తండ్రి అయ్యాడని, నామకరణం తదితర కార్యక్రమాల్లో పాల్గొనాలని అతని వకీలు వాదించారు. ప్రభుత్వ న్యాయవాది వాదిస్తూ తీవ్ర ఆరోపణలు ఉన్నాయని, బెయిల్ ఇస్తే పారిపోతారని అన్నారు. దీంతో పోలీసు భద్రత మధ్య 6 రోజులు బెయిలు ఇస్తూ జడ్జి ఆదేశించారు. 15 నుంచి 20వ తేదీ వరకు బెయిలు లభిస్తుంది. మరోవైపు కేపీఎస్‌సీ మాజీ అధ్యక్షుడు శివశంకరప్ప సాహుకార్, సభ్యురాలు బీవీ గీతను ఈడీ విచారిస్తోంది.
హ్యాకర్ శ్రీకృష్ణకు..
క్రిప్టో కరెన్సీ నగదు అక్రమ బదిలీ కుంభకోణంలో హ్యాకర్ శ్రీకృష్ణ, అకౌంటెంట్ రాబిన్ ఖండేల్‌వాల్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి, బెయిల్ ఇచ్చారు. వారు విడుదలైతే ఆచూకీ లభించని డబ్బును దుర్వినియోగం చేస్తారనే ఈడీ వకీలు వాదనలను తిరస్కరించారు.
ఢిల్లీలో అరెస్టులపై ధర్నా
బాగేపల్లి: ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్న తమ పార్టీ నాయకులతో పాటు ప్రజలను పోలీసులు అమానుషంగా, క్రూరంగా అరెస్టు చేసిన తీరును ఖండిస్తూ, సీపీఎం,డీవైఎఫ్‌ఐ నేతలు నగరంలో కొవ్వొత్తుల నిరసన నిర్వహించారు. జీవీఎస్ విగ్రహం ముందు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ పార్టీ నాయకులను అరెస్టు పేరుతో నిర్బంధించి గంటల తరబడి పోలీసు వాహనాల్లో ఉంచారు, ఆహారం కూడా ఇవ్వలేదు, అమానుషంగా ప్రవర్తించారని ఆరోపించారు. అవసరమైన మందులను కూడా ఇవ్వలేదు. మహిళా నాయకులు, కార్యకర్తలకు టాయ్‌లెట్‌కు సైతం వెళ్లనివ్వలేదు. వారి మొబైల్‌ఫోన్ల స్వాధీనం చేసుకుని అణచివేత ధోరణితో పోలీసులు ప్రవర్తించడం ఎంతమాత్రం తగదు అని మండిపడ్డారు. అరెస్టు చేసినవారిలో చాలామందిని దారుణంగా కొట్టడంతో గాయపడ్డారు అని తెలిపారు. సీపీఎం తాలూకా కార్యదర్శి ఎం.ఎన్.రఘురామ్‌రెడ్డి, మునివెంకటప్ప, చన్నరాయప్ప, డి.టి.మునిస్వామి, అశ్వత్థనారాయణ తదితరులు పాల్గొన్నారు.


