రాష్ట్రంలో చురుగ్గా రైల్వే పనులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో చురుగ్గా రైల్వే పనులు

Oct 13 2026 1:23 AM | Updated on Oct 13 2026 1:23 AM

శివమొగ్గ: రాష్ట్రంలో కొంకణ్‌ రైల్వే అభివృద్ధి పనులకు, దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అనేక ప్రాజెక్టులను చేపట్టేందుకు రూ.9 వేల కోట్లు మంజూరు చేసినట్లు కేంద్ర రైల్వే, జలశక్తి శాఖ సహాయమంత్రి వి. సోమణ్ణ తెలిపారు. శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రైల్వే అభివృద్ధి పనుల పురోగతిపై సోమవారం నగరంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష జరిపారు. తరువాత విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో రూ.52 వేల కోట్ల వ్యయంతో అనేక ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. రాబోయే 25–30 ఏళ్లను దృష్టిలో ఉంచుకుని రైల్వే పథకాల్ని రూపొందించినట్లు చెప్పారు. శివమొగ్గ– శికారిపుర– రాణిబెన్నూరు రైల్వే ప్రాజెక్టు కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌ చేసి, టెండర్‌ను రద్దు చేసి, రాబోయే రెండు నెలల్లో కొత్త టెండర్‌ను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. శివమొగ్గ–బిరూర్‌ రైల్వే లైన్‌ డబ్లింగ్‌ కోసం సర్వే సాగుతోంది, కొత్తగా శృంగేరి– శివమొగ్గ రైల్వే లైన్‌ ప్రతిపాదన పురోగతిలో ఉందని తెలిపారు. శివమొగ్గ, శృంగేరి, ఉడుపి, మంగళూరు రైల్వేలైన్లు, స్టేషన్లను అభివృద్ధి చేస్తామన్నారు. తుమకూరు, శివమొగ్గ రైల్వే స్టేషన్లను అత్యాధునిక స్టేషన్లుగా మార్చడానికి ప్రణాళిక ఉందని ఆయన అన్నారు. వచ్చే ఏడాది ప్రారంభంలో కోటేగంగూర్‌ రైల్వే కోచింగ్‌ డిపోను ప్రారంభించే అవకాశం ఉందని తెలిపారు. ఈ సమావేశంలో యడియూరప్ప, ఎంపీ బి.వై.రాఘవేంద్ర, ఎమ్మెల్యే ఎస్‌.ఎన్‌. చన్నబసప్ప, అరగ జ్ఞానేంద్ర, రైల్వే ఆర్‌ఎం ఉదిత్‌ మిట్టల్‌, ఎస్‌. దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర మంత్రి సోమణ్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement