ఉత్సాహంగా హోంగార్డ్స్‌ స్పోర్ట్స్‌ మీట్‌ | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా హోంగార్డ్స్‌ స్పోర్ట్స్‌ మీట్‌

Oct 11 2026 9:47 AM | Updated on Oct 11 2026 9:47 AM

హొసపేటె: విజయనగర జిల్లా హోంగార్డ్స్‌ ఆధ్వర్యంలో శనివారం జిల్లా క్రీడా మైదానంలో నిర్వహించిన ప్రొఫెషనల్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఉత్సాహంగా సాగింది. హోసపేట నగరంలోని రెండు రోజులు పాటు ఈ క్రీడా పోటీలు నిర్వహించారు. జిల్లా హోంగార్డ్స్‌ జనరల్‌ సెక్రటరీ బసవరాజ్‌ మాట్లాడుతూ.. క్రీడలతో మానసికోల్లాసం కలుగుతుందన్నారు. క్రీడాస్ఫూర్తితో పోటీల్లో పాల్గొనప్పుడే విజయాన్ని అందుకోవచ్చని పేర్కొన్నారు. కబడ్డీ, వాలీబాల్‌, పరుగు పందెం, తాడులాగుడు, షాట్‌పుట్‌, లాంగ్‌ జంప్‌, హైజంప్‌, రైఫిల్‌ స్క్వాడ్‌ డ్రిల్‌, ప్రథమ చికిత్స నమూనా ప్రదర్శన, మ్యూజికల్‌ చైర్స్‌ తదితర పోటీల్లో జిల్లాలోని వివిధ యూనిట్లకు చెందిన హోంగార్డులు, మహిళా సిబ్బంది సత్తా చాటారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌స్ట్రక్టర్‌ ప్రశాంత్‌ పాటిల్‌, ఫస్ట్‌క్లాస్‌ ఆఫీస్‌ అసిస్టెంట్‌ సంతోష్‌, యూనిట్‌ అధికారి ఎస్‌ఎం.గిరీష్‌, ప్లాటూన్‌ కమాండర్‌ ఎల్‌.వాల్యనాయక్‌, కమలాపురం యూనిట్‌ అధికారి వి.పరశురామ్‌, హగరిబోమ్మనహళ్లి యూనిట్‌ అధికారి అన్వర్‌ బాషా, హువినహడగలి యూనిట్‌ అధికారి సుబాన్‌ సాబ్‌, కూడ్లిగి యూనిట్‌ అధికారి కరియప్ప తదితర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement