బళ్లారి రూరల్/బళ్లారి అర్బన్/హొసపేటె: సర్వపితృ మహాలయ అమావాస్య సందర్భంగా శనివారం అల్లిపురం మహదేవ తాత మఠంలో విశేష పూజలు నిర్వహించారు. మహదేవ తాత, శివుడు, వీరభద్రుడు, అమ్మవార్ల మూలవిరాట్‌లను పూలతో అలంకరించారు. భక్తులు దైవదర్శనం చేసుకొని ప్రసాదం స్వీకరించారు. బళ్లారి నగర ఆరాధ్య దైవమైన కనక దుర్గమ్మ ఆలయంలో శనివారం మహాలయ అమావాస్య సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. హంపీలో పితృ పక్షాన్ని పురస్కరించుకుని భక్తులు ప్రత్యేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహించారు. తుంగభద్ర నదీ తరానికి చేరుకున్న భక్తులు తర్పణం, పిండ ప్రదానం చేసి పెద్దలను స్మరించుకున్నారు.


