ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం

Oct 8 2026 12:30 AM | Updated on Oct 8 2026 12:30 AM

రాయచూరు రూరల్‌ : పాత్రికేయులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని పూర్ణిమా ఆయుర్వేద కళాశాల అధ్యక్షుడు కేశవరెడ్డి అభిప్రాయపడ్డారు. బుధవారం రాయచూరు రిపోర్టర్స్‌ గిల్డ్‌లో వజ్రోత్సవం సందర్భంగా జిల్లా పాత్రికేయులకు ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య పరీక్ష శిబిరాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. పాత్రికేయులు పని ఒత్తిడి మధ్య కూడా ఆరోగ్యంపై కనీస జాగ్రత్తలు పాటించాలన్నారు. నేటి ఆధునిక యుగంలో ఆయుర్వేద వైద్యంపై ఆసక్తి పెరిగిందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్‌ చంద్రశేఖర్‌, గిల్డ్‌ అధ్యక్షుడు విజయ్‌ జాగటగల్‌, వెంకటేష్‌, చెన్నబసవ, వీరనగౌడ, ఖాన్‌సాబ్‌ మొమిన్‌లున్నారు.

బాధ్యులపై చర్యలు చేపట్టండి

రాయచూరు రూరల్‌: తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్న కమ్యూనిటీ ఆరోగ్య అధికారులను నిందించడం తగదని కమ్యూనిటీ ఆరోగ్య అధికారుల సంఘం అధ్యక్షుడు యల్లాలింగ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా ఆరోగ్య అధికారి కార్యాలయంలో జిల్లా ఆరోగ్య అధికారిణి నందితకు వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తున్న అధికారులకు భద్రత లేకుండా పోయిందని, తమకు న్యాయం జరిగేలా చూడాలని అన్నారు.

బకాయి వేతనాలివ్వండి

రాయచూరు రూరల్‌: మైసూరు పెట్రో కెమికల్స్‌ లిమిటెడ్‌(ఎంపీసీఎల్‌) పరిశ్రమలో విధులు నిర్వహించిన 98 మంది కార్మికులకు బకాయి వేతనాలివ్వాలని దళిత సేన అధ్యక్షుడు జావిద్‌ ఖాన్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తగిన అనుమతి లేకుండా నూతనంగా మరో పరిశ్రమను నెలకొల్పారని ఆరోపించారు. పీఎఫ్‌, జీపీఎఫ్‌లు ఇవ్వకుండా కార్మికులకు మోసం చేశారన్నారు. ఎంపీసీఎల్‌ పరిశ్రమకు కేటాయించిన ఆదేశాలను నూతనంగా ప్రారంభించిన ఐజీ కంపెనీలను ప్రారంభించడానికి ఎలా అనుమతిచ్చారని, జిల్లా పాలన యంత్రాంగం మౌనం వహించడాన్ని తప్పుబట్టారు.

అంగన్‌వాడీలను

బలోపేతం చేయాలి

రాయచూరు రూరల్‌: రాష్ట్రంలో అంగన్‌వాడీ కేంద్రాలను మరింత బలోపేతం చేయాలని రాష్ట్ర అంగన్‌వాడీ కార్యకర్తల సంఘం జిల్లాధ్యక్షురాలు పద్మ డిమాండ్‌ చేశారు. కన్నడ భవనంలో సీఐటీయూ తాలూకా సమ్మేళనంలో పాల్గొని ఆమె మాట్లాడారు. 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సీ్త్రశిశు సంక్షేమ శాఖ పరిధిలో విధులు నిర్వహిస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బలోపేతం చేయడానికి ముందుకు రావాలన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 60:40 శాతం పద్ధతిలో కనీస వేతనాలు అందించి ఆదుకోవాలన్నారు. వీరేష్‌, శరణ బసవ, వరలక్ష్మిలున్నారు.

ఆరోగ్య శిబిరాలపై

జాగృతి కల్పించాలి

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రజలకు ఆరోగ్య శిబిరాలపై జాగృతి అవసరమని రాయచూరు రూరల్‌ శాసన సభ్యుడు బసనగౌడ దద్దల్‌ పేర్కొన్నారు. రాయచూరు తాలూకా మటమారిలో సముదాయ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు, శిబిరాలతో కలిగే లబ్ధి గురించి ప్రజలకు వివరించాలన్నారు. ఇంటింటికెళ్లి అత్యవసర సమయంలో ప్రచారం చేయడంతో పాటు ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఆరోగ్య సేవలు అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య శాఖాధికారిణి నందితలున్నారు.

అక్రమంగా రెగ్యులర్‌

బనశంకరి: బీబీఎంపీ పశ్చిమవలయ వార్డునెంబరు 65లో 13 మంది పౌరకార్మికులను నిబంధనలకు ఉల్లంఘించి పర్మినెంట్‌ చేశారని బెంగళూరు నాగరికహక్కు పోరాటక కమిటీ ఉపాధ్యక్షుడు గణేశ్‌సింగ్‌ ఆరోపించారు. చట్టవ్యతిరేకమని రుజువైతే ప్రభుత్వానికి జరిగిన నష్టం వసూలు చేయాలని డిమాండ్‌ చేశారు. నేర చరిత్ర ఉన్న ఓ కార్మికున్ని తక్షణం విధుుల నుంచి తొలగించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement