కరువు.. కరెంటుకు దరువు | - | Sakshi
Sakshi News home page

కరువు.. కరెంటుకు దరువు

Oct 7 2026 1:40 AM | Updated on Oct 7 2026 1:40 AM

సాక్షి, బెంగళూరు: ఎల్‌నినో ఉత్పాతం వల్ల రాష్ట్రం కరువు కోరల్లో చిక్కుకుంది. నీటికి కటకట మొదలైంది. ఉష్ణోగ్రతలు చెమటలు పట్టిస్తున్నాయి, ఫలితంగా ఇళ్లు, పరిశ్రమల్లో కరెంటుకు రోజురోజుకి డిమాండు పెరుగుతోంది. సెప్టెంబర్‌ నెలలో 340 మిలియన్ల యూనిట్లు అవసరమయ్యాయి.

అంతటా అధిక వాడకం

కరువు వాతావరణం వల్ల ఇళ్లలో, వాణిజ్య కేంద్రాల్లో ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వినియోగం పెరిగింది. నీటి కోసం పంపుసెట్లు, బోర్ల వాడకం మితిమీరింది. దీంతో విద్యుత్‌ వ్యవస్థపై ఒత్తిడి అతిగా ఉంటోంది. సామాన్యంగా సెప్టెంబర్‌లో వర్షాలు బాగా కురిస్తే విద్యుత్‌ ఖర్చు తక్కువగా ఉంటుంది. గతేడాది సెప్టెంబర్‌లో విద్యుత్‌ వినియోగం సుమారు 220 మిలియన్‌ యూనిట్లుగా ఉంటే ఈ ఏడాది సెప్టెంబర్‌లో 340 మి.యూ.లకు ఎగబాకడం గమనార్హం.

రోజూ 20 వేల మెగావాట్లు

విద్యుత్‌ డిమాండ్‌ పెరగడం వాస్తవమేనని అధికారులు అంగీకరిస్తున్నారు. రోజూ సగటు డిమాండ్‌ 20 వేల మెగావాట్ల కు మించి ఉందని చెప్పారు. ఉత్తరాది నుంచి విద్యుత్‌ను పొందుతున్నట్లు తెలిపారు. కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఇబ్బందే అన్నారు. ఎంత కష్టమైనా రైతులకు ఏడు నుంచి 9 గంటల విద్యుత్‌ ఇవ్వాల్సి ఉందన్నారు.

మరింత ముదరవచ్చు

రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. కొన్నిరోజులుగా పంజాబ్‌–హరియాణా, యూపీ రాష్ట్రాల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో పరిస్థితులు చక్కబడతాయని విద్యుత్‌ శాఖ ఆశాభావం వ్యక్తం చేసింది. అయితే శీతాకాలంలో కూడా ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగితే ఏమిటనేది చెప్పలేకున్నారు.

భారీగా పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌

ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోళ్లు

తీవ్రంగా ఎల్‌నినో ప్రభావం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement